బాలయ్యతో ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను..`మనోభావాల` బ్యూటీ అనుభవాలు!

న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఈ నేపథ్యంలోనే మేకర్స్ వరుస అప్డేట్లను బయటకు వదులుతూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి బ‌య‌టకు వచ్చిన జై బాలయ్య, సుగుణసుందరి పాటలకు మంచి రెస్పాన్స్ ద‌క్కింది. రీసెంట్ గా ఈ సినిమాలోని అదిరిపోయే ఐటెం సాంగ్ బయటకు వ‌దిలారు. `మాబావ‌ మనోభావాలు` అంటూ సాగే ఈ సాంగ్ కు సైతం విశేష ఆద‌ర‌ణ ల‌భించింది. ఈ సాంగ్ లో బాలయ్యతో ఆస్ర్టేలియా నుంచి దిగుమతి అయిన చంద్రికా రవి ఆడిపాడింది.

అయితే తాజాగా చంద్రికా బాల‌య్య‌తో షూటింగ్ అనుభ‌వాల‌ను పంచుకుంది. బాలకృష్ణ నటించే సినిమాలు పాటలు తరుచూ చూస్తాన‌ని, ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవ‌డ‌మే కాదు..కలిసి డాన్స్ చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింద‌ని చంద్రికా పేర్కొంది. బాలయ్య బాబు మోస్ట్ ట్యాలెంట్ నటుడ‌ని, ఆయనతో సెట్ లో గడిపిన క్ష‌ణాలు ఎప్పటికీ మర్చిపోన‌ని, ఈ సినిమా జీవితాంతం గుర్తిండి పోతుంద‌ని చంద్రికా చెప్పుకొచ్చింది. కాగా, ఇప్పుడిప్పుడే కెరీర్ స్టార్ట్ చేసిన చంద్రికా.. ఆరభంలోనే బాలయ్యతో నటించే అవకాశం అందుకుంది. మ‌రి ఇక ముందు ఈమె హ‌వా ఎలా ఉండ‌బోతుందో చూడాలి.