రఘురామ పోటీ చేసే పార్టీ అదే..నరసాపురంలో లక్.!

వైసీపీ రెబల్ ఎంపీగా మారి..అదే వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి నిత్యం విమర్శలు చేస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు..నెక్స్ట్ ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో క్లారిటీ ఇచ్చారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళి నరసాపురం ఎంపీగా పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. ఇక ఆరు నెలల్లోనే వైసీపీలో జరుగుతున్న కొన్ని తప్పులని రఘురామ ఎత్తిచూపారు. దీంతో వైసీపీ సైతం రఘురామపై విరుచుకుపడింది. అలా అలా వైసీపీ-రఘురామ మధ్య గ్యాప్ పెరిగింది.

ఆఖరికి ఆయన్నియ అరెస్ట్ చేసేవరకు సీన్ వచ్చింది..అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటకొచ్చాక కూడా రఘురామ..ఢిల్లీ వేదికగా వైసీపీపై విరుచుకుపడుతున్నారు. ఎలాగైనా రఘురామకు చెక్ పెట్టాలని వైసీపీ చూస్తూనే ఉంది..ఆయనపై వేటు వేయించాలని అనుకుంటుంది..కానీ అది సాధ్యం కావడం లేదు. అయితే వచ్చే ఎన్నికల్లో రఘురామ మళ్ళీ పోటీకి రెడీ అవుతున్నారు. ఈ సారి వైసీపీ నుంచి పోటీ చేయడం జరిగే పని కాదు. దీంతో ఆయన టీడీపీ లేదా జనసేన నుంచి పోటీకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.

కానీ ఇక్కడ రఘురామ..టీడీపీ-జనసేనల మధ్య పొత్తు ఉంటుందని, పొత్తులోనే తాను పోటీ చేస్తానని చెబుతున్నారు.  రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేనలతో కలిసే నేను పోటీ చేస్తానని, అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదని అంటున్నారు. అయితే రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటే రఘురామ గెలుపుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ రెండు పార్టీలు కలిస్తే నరసాపురంలో వైసీపీకి చెక్ పడే ఛాన్స్ ఉంది.

అయితే రఘురామ పోటీ చేసే పార్టీ ఏది అనేది క్లియర్ గా చూస్తే..పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ సీటు జనసేనకే దక్కేలా ఉంది. ఇటు ఏలూరు ఎంపీ సీటు టీడీపీ దక్కే ఛాన్స్ ఉంది. అంటే రఘురామ జనసేన నుంచి పోటీ చేయవచ్చు. కాకపోతే నరసాపురం ఎంపీ సీటులో నాగబాబు ఉన్నారు..ఆయన పోటీ చేయకపోతే ఇబ్బంది లేదు..పోటీ చేస్తేనే ఇబ్బంది. ఒకవేళ నాగబాబు నర్సాపురంలో పోటీ చేస్తే..రఘురామని రాజమండ్రి ఎంపీగా బరిలో దింపుతారని అంటున్నారు. మరి చూడాలి చివరికి రఘురామ ఏ పార్టీలో పోటీ చేస్తారో.