చిరంజీవి చేస్తున్న సహాయాల వెనుక అసలు రహస్యం ఇదేనా..?

మెగాస్టార్ చిరంజీవి అంటే కేవలం సినిమాలకే కాకుండా దానధర్మాలలో కూడా మెగాస్టార్ అనిపించుకున్నారు. ఎప్పటికప్పుడు సహాయాన్ని చేస్తూ బాగా పేరు సంపాదించారు.. అలా ఐబ్యాంక్, బ్లడ్ బ్యాంక్ వంటివి స్థాపించారు.ఇన్నేళ్లలో ఇతరత్రా ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన రక్తదానాన్ని మాత్రం చిరంజీవి వదిలేయలేదు. చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంకు సేవలను వివరిస్తూనే ఉన్నారు అని చెప్పవచ్చు. ఏటా తాను రక్తదానం చేస్తూ తన అభిమానులతో పాటు పెద్ద సంఖ్యలు యువతను కూడా ఆ వైపుగా అడుగులు వేయిస్తున్నారు.

Megastar Chiranjeevi shares audio saying 'I left politics but politics  never left me' ahead of his film Godfather's release

ఇక కరోనా సమయంలో ఎంతోమంది పేద కళాకారులు, సిని కార్మికులు ఉపాధిని కోల్పోయారు. వారిని ఆదుకోవడం కోసం చిరంజీవి ఆధ్వర్యంలోనే చారిటీ సంస్థను కూడా ప్రారంభించారు. దీంతో నిత్యవసర సరుకులు కూడా పంపిణీ చేశారు.ఏకంగా మూడుసార్లు ఇలా పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. అయితే వీటికి మాత్రం చాలా మంది సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటులు ప్రముఖుల సైతం సహాయం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక అలాగే ఆక్సిజన్ సిలిండర్ల కోసం చాలానే ఖర్చు చేశారు. ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు ఉన్న అవసరమున్న సరే ఆయన ముందుకు వస్తూ ఉంటారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.

Chiranjeevi Eye And Blood Bank At Jubilee Hills - Hybiz.tv - YouTube

ఇక చిరంజీవి గుప్తా దానాలు కూడా చాలా చేస్తూ ఉంటారు ఇలా ప్రతిరోజు రూ.4నుంచి రూ.5లక్షల వరకు చేస్తున్నట్లుగా సమాచారం. చిరంజీవి ఇలా దానాలు చేయడం వెనక ఒక కారణం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు కేవలం కుటుంబం గురించి ఆలోచించాను ఇక సమాజానికి తిరిగి ఇవ్వడం మీద దృష్టి పెట్టానని చిరంజీవి గత కొద్ది రోజుల క్రితం తెలియజేశారు. ఎంతో సంపాదించిన చివరికి కుటుంబం కోసం ఏమి కూడబెట్టలేకపోయానని అందుకే తమ కుటుంబానికి ఆస్తులు కూడా పెట్టా అన్నట్లుగా మొదట్లో ఉండేవాడిని చిరు తెలిపారు. ఇప్పుడు ఆ అవసరం లేదని పిల్లలందరూ జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడ్డారని ఆ భగవంతుడు అనుకున్న దానికంటే ఎక్కువగా ఇచ్చారు. జీవితంలో కీర్తి గ్లామర్ శాశ్వతం కాదని వ్యక్తితోనే శాశ్వతం అని నమ్ముతున్నానని చిరంజీవి గారు తెలిపారు. అందుచేతనే సంపాదించిన దాన్ని సమాజానికి తిరిగి ఇచ్చేయబోతున్నాను అంటూ తెలియజేశారు. ఇకపై తన జీవితమంతా చారిటీకే అంకితం అని తెలిపారు. సినిమాల ద్వారా వస్తున్న డబ్బును కూడా చారిటీకి ఉపయోగిస్తున్నానని తెలిపారు.