శాంతానుతో క‌లిసే ఉంటున్నా.. క‌లిసే ఆ పని చేస్తా.. ప‌చ్చిగా మాట్లాడేసిన శ్రుతి హాస‌న్‌!

ప్రముఖ హీరోయిన్ శ్రుతిహాసన్ ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతాను హాజారికాతో గ‌త రెండేళ్ల నుంచి ప్రేమాయణం నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విష‌యాన్ని స్వ‌యంగా శ్రుతి హాస‌నే క‌న్ఫార్మ్ చేసింది. ఈ మ‌ధ్య శాంతానుతో శ్రుతి హాస‌న్ విడిపోయిందంటూ వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. అవి పుకార్లే అని తేలిపోయింది.

శాంతానుతో స‌న్నిహితంగా ఉన్న ఫొటోల‌ను త‌న సోష‌ల్‌మీడియాలో పోస్ట్ తో శ్రుతి హాస‌న్ బ్రేక్ వార్త‌ల‌కు చెక్ పెట్టింది. తాజాగా ప్రియుడితో గురించి ఓ భేటీలో శ్రుతి హాస‌న్ ప‌చ్చిగా మాట్లాడేసింది. `నేను శాంతాను బెస్ట్ ఫ్రెండ్స్. శాంతాను తో కలిసే ఉంటున్నా.. ఇద్దరం కలిసే కామెంట్లు చదువుతాం. ఎందుకంటే ఆ కామెంట్స్ కామెడీగా ఉంటాయి. ఇక తనవల్ల నేను ప్రశాంతంగా మారిపోయాను. అలాగే దయగల వ్యక్తిగా మారాను.

శాంతానా చాలా ప్రశాంతంగా, దయగా ఉంటాడు. అందుకే తనంటే నాకు ఎంతో ఇష్టం. ఈ రెండు లక్షణాలను నేను అలవాటు చేసుకుంటున్నాను` అంటూ శ్రుతిహాసన్ చెప్పకొచ్చింది. మొత్తానికి ఇద్దరం కలిసి ఉంటున్నామన్న‌ విషయాన్ని శ్రుతి స్వయంగా బ‌హిర్గం చేసింది. కాగా, సినిమాల విషయానికి వ‌స్తే.. వచ్చే ఏడాది సంక్రాంతికి శ్రుతి నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీరయ్య` ఒకటి కాగా.. మరొకటి బాలకృష్ణ హీరోగా తెర‌కెక్కుతున్న `వీర సింహారెడ్డి`. ఒక్క రోజు వ్యవధిలో ఈ రెండు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధిస్తే శ్రుతిహాసన్ కు టాలీవుడ్ కు ఇక తిరుగుండ‌ద‌నే చెప్పాలి.