రకుల్ ప్రీత్ సింగ్.. గత కొంతకాలం నుంచి ఈ అమ్మడు బాలీవుడ్ లో స్టార్ హోదా కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది. టాలీవుడ్ లో ఆఫర్లు వస్తున్న సరే వాటిని పక్కన పెట్టి మరి బాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తోంది.
అలా రకుల్ నుంచి ఈ ఏడాది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు చిత్రాలు వచ్చాయి. ఒక్క సినిమా కూడా నార్త్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయినా సరే రకుల్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. బాలీవుడ్ లో ఎలాగైనా సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది.
అలాగే మరోవైపు బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమాయణం నడిపిస్తోంది. షూటింగ్స్ నుంచి గ్యాప్ దొరికినప్పుడల్లా ప్రియుడితో పార్టీలు, వెకేషన్స్ అంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్గా ఉండే రకుల్ ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తుంటుంది. తాజాగా మరోసారి తన అందాలతో చెమటలు పుట్టించే ప్రయత్నం చేసింది.
మోకాళ్ళ పైకి ఉండే వైట్ కలర్ పొట్టి డ్రెస్ లో థైస్ అందాలను చూపిస్తూ హీటు పుట్టించింది. స్టెప్స్ పై నుంచి దిగుతూ నెక్స్ట్ లెవెల్ లో గ్లామర్ షో చేసింది. ఇందుకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.