బాబు దూకుడు..నెల్లూరులో టీడీపీ రాత మారేనా!

టీడీపీని గాడిలో పెట్టి మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అధినేత చంద్రబాబు కష్టపడుతున్నారు. ఈ వయసులో కూడా కాలికి బలపం కట్టుకుని మరీ తిరుగుతున్నారు. జిల్లాల టూర్లకు వెళుతూ..పార్టీకి కొత్త ఊపు తీసుకొస్తున్నారు. ఇక బాబు పర్యటనలకు జనం నుంచి భారీ స్పందన కూడా వస్తుంది. ఇప్పటికే కర్నూలు, ఏలూరు, బాపట్లలో బాబు టూర్లకు జనం నుంచి మంచి స్పందన వచ్చింది.

ఇక ఆయన తెలంగాణపై కూడా ఫోకస్ చేశారు..21వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఆ తర్వాత బాబు..ఏపీలోని ఉమ్మడి విజయనగరం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. గజపతినగరం, బొబ్బిలి, రాజాం స్థానాల్లో బాబు  పర్యటించనున్నారు. 22వ తేదీ నుంచి పర్యటన జరగనుంది. ఇప్పటికే బాబు పర్యటనలకు స్పందన భారీగా వస్తున్న నేపథ్యంలో విజయనగరంలో కూడా మంచి స్పందన వస్తుందని టీడీపీ శ్రేణులు ఆశిస్తున్నాయి.

ఇక విజయనగరం తర్వాత బాబు నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. బాబు పెద్దగా నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లలేదు..ఇప్పుడు బాబు పర్యటన నేపథ్యంలో జిల్లాలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని చెప్పి నేతలు భావిస్తున్నారు.

జిల్లాలో ఈ నెల28న పర్యటించనున్నారు. 28న కందుకూరు, 29న కావలి, 30న కోవూరు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. గత ఎన్నికల్లో ఈ మూడు స్థానాల్లో టీడీపీ దారుణంగా ఓడింది. అయితే ఈ మూడు చోట్ల టీడీపీకి కాస్త బలం పెరిగింది. వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం టీడీపీకి కలిసొచ్చే అంశం.

అసలు కందుకూరు స్థానంలో టీడీపీ గెలిచి చాలా ఏళ్ళు అయింది. వాస్తవానికి ఇక్కడ టీడీపీకి బలం ఉంది. కానీ నేతల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువ ఉంది. అందుకే ఇక్కడ టీడీపీకి ఓటమి ఎదురవుతుంది. ఈ సారి ఆ పరిస్తితి రాకూడదని చెప్పి బాబు ప్రయత్నిస్తున్నారు. పైగా కమ్మ వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలని చూస్తున్నారు. మొత్తానికి బాబు టూర్ వల్ల నెల్లూరులో టీడీపీ తలరాత మారుతుందేమో చూడాలి.