కోలీవుడ్లో యంగ్ హీరో ఆది పినిశెట్టి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. అయితే ఒక నటుడు గానే కాకుండా ఎన్నో చిత్రాలలో హీరోగా విలన్ గా నటించి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఆది పినిశెట్టి. గతంలో వైశాలి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ ఆరివళగన్ తో 13 ఏళ్ల తర్వాత కలిసి ఒక సినిమాని చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లు శబ్దం అనే టైటిల్ తో ఒక హర్రర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఆది పినిశెట్టి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని మేకర్ ఒక గ్లింపింగ్ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. రద్దీగా ఉండే గబ్బిలాల చుట్టూ ఒక భారీ చెవిలోకి ప్రవేశించడం వింతైన గబ్బిలాల శబ్దం ప్రతిధ్వనులు ఆసక్తిని రేపించేలా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరొక హిట్ సినిమా నీ సీక్వెల్ చేయడానికి సిద్ధమయ్యారు ఆది పినిశెట్టి. అది ని ఒక అభిమాని మరకతమణి సినిమా సీక్వెల్ చేయమని అడిగారట. అందుకు ఆది స్పందిస్తూ తాను కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు.
దీంతో హిట్ సినిమా సీక్వెల్ ప్లాన్ చేయాలా లేదా అన్న విషయం దర్శకులు నిర్ణయంగా తెలుస్తోంది. మరతకమణి సీక్వెల్ కథ రెడీ చేస్తే నటించడానికి తాను సిద్ధమే అన్నట్లుగా తెలియజేశారు. మరి ఈ సినిమా పైన మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ చిత్రాన్ని అర్క్ శరవరన్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కూడా ఒక హర్రర్ కామెడీ జోన్ లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఆది పినిశెట్టి భార్య నిక్కీ గల్రాని నటించింది. మరి ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడు తెరకెక్కిస్తారో చూడాలి మరి.