మాల్దీవ్స్‌లో జాన్వీ.. ఒక‌రోజు ఉండ‌టానికి ఎంత ఖ‌ర్చు పెడుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

దివంగత నటి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి కొత్తగా ప‌రిచ‌యాలు అవసరం లేదు. ధడక్ అనే హిందీ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ అందాల భామ.. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. అయితే జాన్వీ కపూర్ కు సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ క్రేజ్ దక్కింది.

ఎలాంటి బౌండరీలు పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో ఈ బ్యూటీ దూమారం రేపుతుంటుంది. ఈ క్రమంలోనే జాన్వీకి ఫాలోయింగ్ భారీగా పెరిగింది. ఇకపోతే ఈ అమ్మడు ఫ్రీ టైం దొరికినప్పుడల్లా వెకేషన్ కు చెక్కేస్తుంటుంది. ముఖ్యంగా మాల్దీవ్స్ లో ఈమె చేసే సందడి అంతా కాదు. రీసెంట్ గా కూడా జాన్వీ కపూర్ మాల్దీవ్స్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసి వచ్చింది.

అయితే అక్కడ ఒకరోజు ఉండడానికి జాన్వీ కపూర్ చేసే ఖర్చు తెలిస్తే మతిపోతుంది. సోనేవా జానీ అనే రిసార్ట్ లో 51 ఓవర్-వాటర్ విల్లాలు, మూడు ఐలాండ్ విల్లాలు ఉన్నాయి. ఈ విల్లాలు చాలా లగ్జరీగా ఉంటాయి. వీటిలో 2 బెడ్‌ రూమ్ వాటర్ రిట్రీట్ విత్ స్లైడ్ విల్లాలో జాన్వీ ఎప్పుడూ స్టే చేస్తుంది. అయితే ఈ విల్లాలో ఒక్క రాత్రి గడపడానికి సుమారు రూ. 14 లక్షలు అవుతుంద‌ట‌. ఇక అక్కడ ఉన్నన్ని రోజులు రోజుకు రూ. 14 ల‌క్ష‌లు సమర్పించడంతో పాటు.. ఇతర ఖర్చులు కలిపి మరికొన్ని లక్షలు అవుతుంద‌ని అంటున్నారు. ఏదేమైనా జాన్వీ మాల్దీవులలో ఎంజాయ్ గ‌ట్టిగానే ఖ‌ర్చు పెడుతోంది.