పుష్ప -2 చిత్రం బృందం ఆ హీరోయిన్ పాత్ర పై క్లారిటీ ఇచ్చేనా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ రష్మిక కాంబినేషన్లో వచ్చిన చిత్రం పుష్ప . ఈ చిత్రం మొదటి భాగం విడుదలై మంచి విజయం సాధించడంతో రెండో భాగాన్ని కూడా అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలోని కొన్ని మార్పులు చేసి ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక మొదటి భాగం లో ఉండే పాత్రలు సహా కొత్త పాత్రలు తెరపైకి కనిపించబోతున్నట్లు వార్తలు వినిపించాయి.

Viral video: 'Pushpa' director Sukumar calls Sai Pallavi 'lady Pawan Kalyan'

ఇందులో భాగంగా మరొక హీరోయిన్గా ఇందులో సాయి పల్లవి తీసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి. ముఖ్యంగా స్క్రిప్ట్ రెండోవ భాగంలో ఈమె పాత్ర ఎక్కువ డిమాండ్ ఉందని వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈ చిత్రంలో ఏమే నటిస్తుందా లేదా అన్న విషయంపై ఇంతవరకు చిత్ర బృందం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మరొక కొత్త పాత్ర తెరపైకి వస్తోంది. అదేమిటంటే ఇందులో ఒక గిరిజన యువతి పాత్ర కీలకంగా ఉంటుందట.ఆ పాత్రకి ఐశ్వర్య రాజేష్ అయితే పక్కాగా సూట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.

ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఇలాంటి పాత్రలో ఐశ్వర్య రాజేష్ ఒదిగిపోయి నటిస్తుందని చెప్పవచ్చు. అయితే అభిమానులు మాత్రం ఈ చిత్రంలో సాయి పల్లవి తీసుకోవాలనుకున్నది సెకండ్ లీడ్గా. లేకపోతే ఇలాంటి పాత్ర కోసమే అన్నట్లుగా కొంతమంది అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా సాయి పల్లవికి ఎలాంటి పాత్ర నచ్చిన సరే కచ్చితంగా ఆ పాత్రకు కమిట్ అవుతుంది. అది చిన్నదా.? పెద్దదా? అని ఆలోచించదని పలువురు నెటిజెన్లు తెలియజేస్తున్నారు. మరి ఇలాంటి గందలగోళంపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.