ఆ హీరోల‌కు బాల‌య్య దెబ్బ‌తో ద‌బిడి దిబిడేనా…!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6గ్రాండ్ ఫినాలేకు 72 గంటల సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ రాబోయే సీజన్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చ‌ర్చ‌ జరుగుతుంది. అయితే ఈ సీజన్ మాత్రం ఇప్పటివరకు జరిగిన సీజన్లకుకన్నా అతి తక్కువ టిఆర్పి రేటింగ్ తెచ్చుకున్న సీజన్ గా మిగిలిపోయింది. మరోవైపు బిగ్ బాస్ షో విషయంలో నాగార్జున కూడా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది.

తాను ఎంతగా కష్టపడినా సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్లు వస్తున్నాడం నాగార్జున‌ను ఎంతో తీవ్రంగా హర్ట్ చేసిందని సమాచారం అందుతుంది. ఈ కారణంగా రాబోయే ఏడో సీజన్ కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. దీంతో బిగ్ బాస్ హోస్ట్ గా ఈ షో నిర్వహకులు బాలకృష్ణను సంపాదిస్తున్నట్టు తెలుస్తుంది.

 Balakrishna Is The Host For Bigg Boss 7 Show Details, Balakrishna, Bigg Boss 7 T-TeluguStop.com

బాలకృష్ణ బిగ్ బాస్ షోకు వ్యాఖ్యాత‌గా చేస్తే మాత్రం అది మామూలుగా ఉండదని కామెంట్లు వస్తున్నాయి.
బాలయ్య అషోకు హోస్టుగా చేస్తే ఆషో కూడా ఎవ‌రు ఊహించని కొత్తదనం వస్తుంది. ఇప్పటికే బాలయ్యహోస్టుగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో భారతదేశంలోనే టాప్ టాక్ షోగా నిలిచింది.
బాలయ్య ఏ షోలోకి ఎంట్రీ ఇచ్చినా దబిడి దిబిడేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం బాలయ్యకు పరిస్థితులు సైతం అనుకూలంగా ఉన్నాయని ఆయన ఏం చేసినా సక్సెస్ అవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అన్ స్టాపబుల్ షోతో రేంజ్ మార్చుకున్న బాలయ్య బిగ్ బాస్ షోతో తన స్థాయి మరింత పెంచుకోవడం గ్యారంటీ అని కొంతమంది చెబుతున్నారు.