‘కాంతారా’ భూతకోలా వేడుకల్లో అనుష్క చేసిన పనికి అంతా షాక్..జేజమ్మ ఇలాంటివి నమ్ముతుందా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన సూపర్ సినిమాతో నాగార్జున సరసన నటించి మంచి పేరు సంపాదించుకున్న అనుష్క .. మొదటి సినిమాతోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . ఇక తర్వాత హిట్లు ఫ్లాపులు అంటూ సంబంధం లేకుండా .. తనదైన స్టైల్ లో సినిమాలో నటిస్తూ స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోస్ వరకు అందరితో కలిసి నటించి మెప్పించింది.

గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అనుష్క ..ప్రజెంట్ నవీన్ పోలిశెట్టితో యు.వి క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమాలో అనుష్క శెట్టి ఓ చెఫ్ పాత్రలో కనిపించబోతుందని.. వయసు ఎక్కువ ఉన్న అమ్మాయికి పెళ్లి కాకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో ఈ సినిమాలో క్లియర్ గా చూపించబోతున్నారు. కాగా రీసెంట్ గా అనుష్క కి సంబంధించిన కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

తాజాగా అనుష్క ఫ్యామిలీతో తన స్వస్థలం మంగళూరుకు వెళ్ళింది . అక్కడే అభిమానులను సర్ప్రైజ్ చేసింది . కాంతారా చిత్రంలో చూపించిన విధంగా భూతకోలా వేడుకులకు అటెండ్ అయ్యింది .అనుష్క శెట్టి భూతకోలా నృత్యాన్ని భక్తిశ్రద్ధలతో వీక్షించడం .. సోషల్ మీడియాలో దానికి సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి . అంతేకాదు ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ తన కల్చర్ ని చక్కగా ఫాలో అవుతుంది అంటూ అనుష్క శెట్టిపై ప్రశంసలు కురిపిస్తున్నారు . అక్కడ భూతకోలా వేడుకలను తన ఫోన్లో బంధించిన ఫోన్లో రికార్డ్ చేసుకున్నింది అనుష్క శెట్టి. ప్రజెంట్ దీనికి సంబంధించిన పిక్స్ ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి . చక్కగా చీర కట్టుకొని అనుష్క భూతకొలా వెడుకులకు హాజరవ్వడం అభిమానులను ఆకట్టుకున్నింది. ప్రజెంట్ అనుష్క శెట్టి భూతకోలా వేడుకలకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.