భారీ ధ‌ర ప‌లికిన `18 పేజెస్‌` ఓటీటీ రైట్స్‌.. నిఖిల్ ముందు స్టార్ హీరోలు దిగ‌దుడుపేనా?

`కార్తికేయ 2` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మ‌రో సినిమా `18 పేజెస్‌`. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు.

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. డిసెంబ‌ర్ 23న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన టీజ‌ర్‌, సాంగ్స్‌, ట్రైల‌ర్ తో ఈ సినిమాపై ఎన్నో అంచ‌నాలు నెల‌కొన్నాయి. ప్ర‌మోష‌న్స్ తో మేక‌ర్స్ మ‌రింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే `18 పేజెస్‌`కు భారీ స్థాయిలో బిజినెస్ జ‌రుగుతోంది.

నిఖిల్ ముందు స్టార్ హీరోలు దిగ‌దుడుపేనా అనేంత‌లా ఈ మూవీ హ‌క్కులు అమ్ముడుపోతున్నాయి. తాజాగా ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ ఫ్లిక్స్ `18 పేజెస్‌` డిజిట‌ల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. శాటిలైట్‌ రైట్స్ ని ప్రముఖ ఎంటర్టైన్‌మెంట్‌ సంస్థ దక్కించుకుందని తెలుస్తుంది. డిజిట‌ల్‌, శాటిలైట్‌ రైట్స్ రూపంలో ఈ సినిమాకు రూ. 20 కోట్లు వ‌చ్చిన‌ట్లు టాక్ న‌డుస్తోంది. ఈ మూవీ కోసం మేక‌ర్స్ రూ. 12 కోట్ల బ‌డ్జెట్ పెట్టారు. అయితే డిజిట‌ల్‌, శాటిలైట్‌ రైట్స్ రూపంలోనే ఈ చిత్రానికి బ‌డ్జెట్ రిక‌వ‌రీ అయిపోవ‌డం విశేషం.