డబ్బుపై సమంత ఆసక్తికర కామెంట్స్.. తనకి అదే ఇంపార్టెంట్ అట

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత. ఈ అందాల తార తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ది ఫ్యామిలీ-2 అనే వెబ్‌సిరీస్‌లో బోల్డ్‌గా నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. అంతేకాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాలో నటించిన తన నటన సామర్ధ్యని నిరూపించుకుంది. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘యశోద’ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. ఇక ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఇంకో సినిమా ‘శాకుంతలం’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా పై కూడా సమంత అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

ఇదిలా ఉండగా.. తాను మయోటిస్ అనే వ్యాధి బారిన పడినట్లు సామ్ పబ్లిక్ గా వెల్లడించింది. ప్రస్తుతం ఆ మయోటిస్ వ్యాధికి చికిత్స పొందుతున్న సామ్ కోసం ఖుషి మూవీ టీమ్ ఎదురుచూస్తున్నారు. ఈ సందర్బంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాల గురించి ప్రస్తావించింది. దాంట్లో భాగంగా తనకు కోపం వచ్చినపుడు వెంటనే జిమ్‌కి వెళ్లి వర్క్ ఔట్స్ చేస్తానని.. అప్పుడు కోపం ఇట్టే పోతుందని ఈ ముద్దుగుమ్మ తెలిపింది. తాను డబ్బు, పేరు మీరు ప్రఖ్యాతల గురించి అసలు ఆలోచించనని వాటి వెనుక అస్సలు తాను స్పష్టం చేసింది. అన్నిటికంటే నటనే తనకు చాలా ఇంపార్టెంట్ అని వెల్లడించింది.

తాను నటించే ప్రతి పాత్రను ఎంతో ఎంజాయ్ చేస్తానని సామ్ చెప్పుకొచ్చింది. ఎవరి తప్పులను వారు తెలుసుకొని వాటిని సరిదిద్దుకొని వారి వృత్తిలో ఎదగడానికి ప్రయత్నించాలని సామ్ సలహా ఇచ్చింది. నీకు నచ్చినట్లు నువ్వు బ్రతకడం నేర్చుకో! ఎవరికోసమో, లేదా ఒక అనుబంధం కోసమో, లేక ఇతరులను సంతోషపెట్టాలనో ఆలోచిస్తే మనం ఎదగడం కష్టం సమంత.