సుకుమార్ కు బ‌న్నీ వార్నింగ్‌.. అంద‌రిముందు అవి లీక్ చేస్తానంటూ కామెంట్స్‌!

ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కు బన్నీ వార్నింగ్ ఇచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన `18 పేజెస్` చిత్రం డిసెంబర్ 23న గ్రాండ్ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు.

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా.. అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో బన్నీ సుకుమార్ పై పొగడ్తల వర్షం కురిపించాడు. సుకుమార్ లేకపోతే తాను లేనని.. ఈ సినీ కెరీర్ తను ఇచ్చిందే అని బన్నీ చెప్పుకొచ్చాడు. అందుకే సినిమా లేట్ అయినా తన నుంచి సుకుమార్ ఎలాంటి ప్రెజ‌ర్ ఉండదని బన్నీ స్పష్టం చేశారు.

అలాగే పుష్ప 2 గురించి అందరూ అప్డేట్ అడుగుతున్నారని, త్వరగా ఆ అప్డేట్ ఇవ్వకపోతే ఈ సినిమాలో డైలాగ్స్ అన్ని లీక్ చేసేస్తానని సుకుమార్ కు అందరి ముందు న‌వ్వుతూనే స్వీట్ గా వార్నింగ్‌ ఇచ్చాడు. అలాగే త్వరలోనే పుష్ప 2 అప్డేట్ వస్తుందని కూడా పేర్కొన్నారు. ఇక `18 పేజెస్` గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా బాగుంటుందని.. తప్పకుండా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని బన్నీ పేర్కొన్నాడు. చిత్ర టీమ్‌ మొత్తానికి తన బెస్ట్ విషెస్ ను తెలియజేశాడు.