ఎమ్‌బిబిఎస్ ఎగ్జామ్స్ రాసి థియేట‌ర్‌లో టికెట్స్ అమ్ముతున్న శ్రీ‌లీల‌.. వీడియో వైర‌ల్‌!

`పెళ్లి సందD` మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన అందాల భామ శ్రీ‌లీ.. తొలి సినిమాతోను ఎంత‌టి క్రేజ్ ను సంపాదించుకుందో తెలిసిందే. ఇప్పుడు ఈమె నుంచి రెండో సినిమా రాబోతోంది. అదే `ధ‌మాకా`. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు.

ఇందులో మాస్ మ‌హారాజ ర‌వితేజ హీరోగా న‌టించాడు. ఈ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ క్రిస్మస్ కానుక‌గా డిసెంబ‌ర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ జోరుగా ప్ర‌చారకార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంది. అయితే తాజాగా హీరోయిన్ శ్రీ‌లీల సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు థియేట‌ర్ లో టికెట్స్ కూడా అమ్మింది.

ఇటీవలే ముంబైలో ఎమ్‌బిబిఎస్ ఎగ్జామ్స్ రాసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ‘ధమాకా’ ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. ఇందులో భాగంగానే హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఎంబీ మాల్‌లో కాసేపు సందడి చేసిన శ్రీ‌లీల‌.. ప‌నిలో ప‌నిగా `ధమాకా` అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ కూడా అమ్మింది. స్వ‌యంగా శ్రీ‌లీల టికెట్స్ అమ్మ‌డంతో ఫ్యాన్స్ ఎగ‌బ‌డి మ‌రీ కొనుక్కున్నారు. అంతేకాదు, ఈ సంద‌ర్భంగా అక్క‌డితో శ్రీ‌లీల డ్యాన్స్ కూడా చేసింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది.