రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఏం చేసిన సెన్సేషనల్ గానే ఉంటుంది . టాలీవుడ్ లో రౌడీ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో క్లాసిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు . నిజానికి పెళ్లిచూపులు సినిమా కన్నా ముందు విజయ్ దేవరకొండ సినిమాల్లో నటించాడు. కానీ ఏ సినిమా కూడా ఆయనకి గుర్తింపు తీసుకురాలేకపోయింది. పెళ్లిచూపులు సినిమాలతో ఒక్కసారిగా ఫాం లోకి వచ్చిన విజయ్ దేవరకొండ ..ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో సినీ ఇండస్ట్రీ రికార్డును తిరగ రాశాడు.
కాగా రీసెంట్ గానే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన లైగర్ సినిమా ఫ్లాప్ టాక్ సంపాదించుకున్న సరే ..విజయ్ నటనకు మంచి మార్కులే వేశారు జనాలు . నత్తివాడిగా ఈ సినిమాలో ప్రాణం పెట్టినటించాడు విజయ్. కానీ డైరెక్షన్ పరంగా ఫ్లాప్ అవడంతో విజయ్ దేవరకొండ కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అయ్యింది. అప్పటినుంచి విజయ్ దేవరకొండను సోషల్ మీడియాలో ఏదో ఒక కారణంగా టృఓల్ చేస్తూనే ఉన్నారు . దీనితో విజయ్ ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు .
అలాంటి వాళ్లకు ఇప్పుడు బుద్ధి వచ్చే ఆన్సర్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ . ఎవడే సుబ్రహ్మణ్యం చేస్తున్న సమయంలో విజయ్ దేవరకొండ ఫాదర్ కి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి . ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు . కాగా రీసెంట్గా పేస్ హాస్పిటల్స్ కి సంబంధిత కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది . ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ..”మా నాన్నగారికి హెల్త్ బాగోలేనప్పుడు నాకు అండగా నిలిచింది పెస్ హాస్పిటల్. అందుకే వారి ఆహ్వానించగానే కాదు లేదు అనుకుండా వచ్చేసాను”. మరి ముఖ్యంగా ఆర్గాన్ డొనేషన్ గురించి ఆయన ఎక్కువగా ఈ మీటింగ్ లో మాట్లాడారు. ” ఎండ్ కార్డ్ పడిన లైఫ్స్ ని కూడా బ్యూటిఫుల్ గా మార్చేస్తున్నారు ఈ హాస్పిటల్.. ఈ క్రమంలోనే నేను నా ఆర్గాన్స్ అన్నిటిని డొనేట్ చేయడానికి ముందుకు వస్తున్నాను . నేను చనిపోయాక ఎవరో ఒకరు నా అవయవాలను తీసుకుని బ్రతకడం వారి జీవితాల్లో ఆనందం ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది”..అంతూ చెప్పుకొచ్చారు.
దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు. అంతేకాదు సినిమా ప్రమోషన్లకి సొల్లు కబుర్లు చెప్పే హీరోల కన్నా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే మా విజయ్ దేవరకొండ చాలా గ్రేట్ అన్ని ట్రెండ్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ ఫాన్స్ . ఏది ఏమైనా సరే ఈ విషయంలో రౌడీ హీరో కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!!