అన్ స్టాపబుల్2: ఎవరు ఊహించని గెస్ట్ లతో నాలుగో ఎపిసోడ్ వచ్చేస్తుంది..!!

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 107వ సినిమా వీరసింహారెడ్డి షూటింగ్లో బిజీగా ఉన్నాడు. సినిమాలు చేస్తూనే మరోపక్క ఆహాలో అన్‌స్టాపబుల్ 2 షూటింగ్లో పాల్గొంటున్నాడు. మొదటి సీజ‌న్‌కి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో రెండో సీజన్ కూడా దానికి మించి సెన్సేషనల్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఈ సీజ‌న్ తొలి ఎపిసోడ్ గాను బాలకృష్ణ బావమరిది చంద్రబాబుతో.. బాలయ్య అల్లుడు లోకేష్ మొదటి ఎపిసోడ్‌లో పాల్గొన‌ గా.. ఈ ఎపిసోడ్ కి అదిరిపోయే టాక్ తో భారీ వ్యూస్ ను దక్కించుకుంది.

Unstoppable with NBK Season 2: Balakrishna, Chandrababu Naidu, Nara Lokesh  unite for the premiere episode

ఆ తర్వాత రెండో ఎపిసోడ్ కి సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వచ్చారు. ఈ ఎపిసోడ్ కూడా బాలయ్య మాస్ డైలాగ్స్ తో అదిరిపోయే రెస్పాన్స్ ని దక్కించుకుంది. మూడో ఎపిసోడ్ కి గాను యువ హీరోలు శర్వానంద్, అడివి శేష్ పాల్గొన్నారు.. ఈ ఎపిసోడ్ కూడా ఎవరు ఊహించిన విధంగా భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఈ నలుగురు యువ హీరోలతో బాలయ్య చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

ఇక ఇప్పుడు రాబోయే నాలుగో ఎపిసోడ్ కు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిలు పాల్గొన్నారు, దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా ఆహా విడుదల చేసింది. ఈ నాలుగో ఎపిసోడ్ నవంబర్ 18న ప్రీమియర్ గా ప్రసారం కానుంది.. అని మేకర్స్‌ తాజాగా ప్రకటించారు. ఈ రెండో సీజన్ లో సినిమా వారి కన్నా పొలిటికల్ లీడర్స్‌ని ఎక్కువగా ఉండేలా ఆహా టీమ్‌ చూస్తుంది. రాబోయే ఎపిసోడ్‌లో ఇంకా కొత్త పొలిటికల్ లీడర్స్ ఎవరెవరు వస్తారా అనేది చూడాలి..!!

Share post:

Latest