బాలీవుడ్ హాట్ భామతో ఇండియన్ కుర్ర క్రికెటర్ డేటింగ్… ఒకే ఒక సమాధానం తో కన్ఫామ్ చేశాడుగా..!!

బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఈ ముద్దుగా ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో బయటకు వచ్చిన అప్పటినుంచి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ టాక్ షోలో శుభమన్ గిల్ ఈ వార్తలపై స్పందించాడు.

ఆ ఇంటర్వ్యూలో మీరు సారా తో డేటింగ్ చేస్తున్నారా అని అడగగా.. శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ ..”కావచ్చు” అని సమాధానం ఇచ్చాడు. వ్యాఖ్యాత అతనిని మళ్లీ నిజం చెప్పమని అడగగా.. గిల్ నేను నిజమే చెప్తున్నాను ” కావచ్చు, కాకపోవచ్చు” అని సమాధానం ఇచ్చాడు.

తర్వాత వీరిద్దరూ మరొక సందర్భంలో ఒకే విమానంలో కలిసి ప్రయాణిస్తున్న ఫోటో కూడా ఒకటి బయటికి వచ్చి ఆ టైంలో నానా రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు కూడా మరింత వైరల్ గా మారాయి. గతంలో గిల్ భారత క్రికెట్‌ దేవుడు సచిన్ కూతురుతో ప్రేమలో ఉన్నారని వార్తలు కూడా వచ్చాయి.. అయితే ఇక ఇప్పుడు నటి సారా అలీ ఖాన్ తో డేటింగ్ వ్యవహారం అందర్నీ ఆశ్చర్యపరిచింది.