తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సేవలను చేసి ఎన్నో సాహస ప్రయోగాత్మకంగా చిత్రాలను తెలుగు తెరకు పరిచయం చేసిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. దాదాపుగా ఐదు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగినటువంటి కృష్ణ సుమారుగా 350 కు పైగా చిత్రాలలో నటించారు. లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డుతో పాటు.. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ఇక తరువాత 2008లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డాక్టర్ రేటు కూడా పొందారు.
2009వ సంవత్సరంలో కృష్ణకు పద్మభూషణ్ బిరుదుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. అయితే ఈ పద్మభూషణ్ రావడం వెనుక దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి హస్తం ఉందని స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారట కృష్ణ. తన కూతురు మంజులతో కలిసి నిర్వహించిన ఒక చిట్ చాట్ లో భాగంగా కృష్ణ తనకు వచ్చినటువంటి పద్మభూషణ్ గురించి తెలియజేస్తూ పలు విషయాలను తెలియజేశారు. పద్మభూషణ్ అవార్డు గురించి మంజుల ప్రశ్నించగా తాను పద్మభూషణ్ అవార్డు కోసం ప్రయత్నాలు చేయలేదని అయితే 2009లో ఒక సందర్భంలో రాజశేఖర్ రెడ్డి గారిని కలవగా చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు చేస్తున్న మీకు ఇప్పటివరకు పద్మభూషణ్ రాకపోవడం చాలా బాధాకరమని తనతో చెప్పారని తెలిపారుట కృష్ణ.
అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి పద్మభూషణ్ రావడానికి కారణం అయ్యారని సమాచారం. ఈ విధంగా కృష్ణ గారికి పద్మభూషణం రావడం వెనుక వైయస్సార్ హస్తం ఉందని తెలుస్తోంది. అయితే కృష్ణ దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు. అది గ్రహించిన రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ కూడా కృష్ణ అని పలకరిస్తూ ఉండేవారట.అలా వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని తెలుస్తోంది. ఇక అలా పోకిరి సినిమాకి కూడా పలు అవార్డులను అందించే సమయంలో రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగానే అందుకున్నారు. అలా వీరిద్దరి స్నేహం కారణంగానే పద్మ భూషణ్ అవార్డు గురించి రాజశేఖర్ రెడ్డి ప్రయత్నం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.