ఆన్ స్టాపబుల్ షో కి ఎవరు ఊహించిన అతిథి.. బాలయ్యతో- షర్మిల..!

బాలకృష్ణ గా వ్యాఖ్యాతగా చేసిన అన్ స్టాపబుల్ షో ఎంతటి పెద్ద సంచలన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ షో కి కొనసాగింపుగా రెండో సీజన్ కూడా ఇటీవల మొదలైంది. తొలి సీజన్ కంటే రెండవ సీజన్ కి ఎవరు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు రెండు ఎపిసోడ్లు పూర్తయ్యాయి.. ఈ వారంతో మూడో ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ అవ్వబోతుంది.
ఈ సీజన్లో తొలి ఎపిసోడ్ కి నారా చంద్రబాబునాయుడు మరియుు లోకేష్ ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ ఎపిసోడ్ ఎవరు ఊహించిన విధంగా భారీ రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఏ టాక్‌ షో కి రాని వ్యూస్ ఈ ఎపిసోడ్ కి వచ్చింది. ఇక రెండో ఎపిసోడ్ కి గాను యువ‌ హీరోలు విశ్వక్ సేన్ మరియు సిద్ధులు జొన్నలగడ్డ గెస్టులుగా వచ్చారు.

 నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా మారి చేసిన తొలి టాక్ షో ‘అన్‌స్టాపబుల్’. ఫస్ట్ సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ టాక్ షోకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో, ఇప్పుడు రెండో సీజన్‌ను రెడీ చేశారు నిర్వాహకులు.(Twitter/Photo)

ఇక ఇప్పుడు వచ్చే మూడో ఎపిసోడ్ కి శర్వానంద్ మరియు అడవి శేష్ గెస్టులుగా హాజరయ్యారు. తర్వాత వచ్చే నాలుగో ఎపిసోడ్స్ కి కూడా ఎవరు ఊహించని గెస్ట్ లు వస్తున్నారని వార్తలు వస్తున్నాయి.. ఈ క్రమంలోనే రాబోయే ఎపిసోడ్లో రాజకీయాలలో ప్రకంపన‌లు రేపే ఎవరు ఊహించని గెస్ట్ అన్ స్టాపబుల్ షో కి రాబోతున్నారని తెలుస్తుంది. ఆ గెస్ట్ మరి ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఈ టాక్ షో కి ముఖ్య అతిథిగా రాబోతున్నారని తెలుస్తుంది. ఇక షర్మిల తో పాటుగా ఆమె తల్లి విజయమ్మ కూడా ఈ షోకి వస్తున్నారట.. ఇప్పుడు ఈ వార్త తెలుగు రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపాలను సృష్టిస్తుంది. షర్మిల ఇటీవల తెలంగాణలో సొంత పార్టీ పెట్టి ఎక్కడ పాదయాత్ర చేస్తూ పార్టీని బలోపేతం చేస్తుంది. ఈ క్రమంలోనే తన అన్నయ్యపై కూడా డైరెక్టుగా సెటైర్లు విమర్శలు కూడా చేస్తుందింది.

ఇక ఈమె మొన్న ఈ మధ్యనే టిడిపికి అనుకూలంగా ఉండేే ఏబీఎన్ ఛానల్ లో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’టాక్‌ షోలో షర్మిల పాల్గొంది. ఇప్పుడు ఏకంగా టిడిపి ఎమ్మెల్యే చంద్రబాబు బావమరిది ఎన్టీఆర్ కొడుకు అయిన నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న టాక్‌ షో కి ముఖ్య అతిథిగా వస్తుండటం అందరికీ షాక్ ఇచ్చే విషయమే. .. ఇక ఈ టాక్ షో ద్వారా షర్మిల ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతున్నారు అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..!

Share post:

Latest