ఒక్కే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్.. డైరెక్టర్ కాళ్ల పై పడి ఏడ్చిన సింగర్..!!

సింగర్ మనో.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా, సింగర్ గా ఇటీవల రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ మల్టీ టాలెంటెడ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. సింగర్ మనో తాజాగా `అందరూ బాగుండాలి అందులో నేనుండాలి` అనే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రశంసలు అందుకున్నాడు. అయితే మనో ఈ స్థాయికి రావడానికి తన కెరీర్ లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడట.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సింగర్ మనో తన కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. మనో మాట్లాడుతూ.. తాను రజినీకాంత్ కు తెలుగులో డబ్బింగ్ చెప్పడం కారణంగానే తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందాడట. మనో విజయవాడలో సంగీతం నేర్చుకుంటున్నప్పుడు డైరెక్టర్ దాసరి నారాయణరావు నటుడిగా తనకు నాలుగు సినిమాల్లో నటించేందుకు అవకాశం ఇప్పిచ్చారట.

అయితే ఓ సినిమాలో హీరో తల్లి క్యారెక్టర్ కోసం వారి అమ్మను సెలెక్ట్ చేశార‌ట‌. దాంతో అదే సినిమాలో తనుకు కూడా ఒక్కే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్..అంటూ దాసరి నారాయణరావు గారి కాళ్ళ మీద పడి చాలా ఏడ్చారట సింగర్ మనో. దాసరి నారాయణరావు తనని ఆ క్యారెక్టర్ కి సెట్ కావని చెప్పడంతో బాధపడిన మనో.. అదే సినిమాలో నటించేందుకు అవకాశం రావడంతో తన ఆనందానికి హద్దులు లేవంటూ ఆయన చెప్పుకొచ్చారు.

ఇక అంతేకాకుండా ఆ సినిమా మంచి హిట్ అందుకొని ఆయన జీవితాన్ని మలుపు తిప్పిందట. ఆ తరువాత మ్యూజిక్ కి సంబంధించి చాలా విషయాలను కూడా నేర్చుకోగలిగారంటూ పైగా ఎస్పీ బాలసుబ్రమణ్యం వల్లే తనకు సింగర్ గా మంచి గుర్తింపు రాలేదని మనో ఎప్పుడు భావిస్తారని ఆ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. అయితే మనో సినిమాల్లో నటించడానికి అయినా పాటలు పాడడానికైనా చాలా తక్కువ పారితోషకం తీసుకుంటారని సమాచారం.

Share post:

Latest