టాలీవుడ్ లో హీరోలంటే బాలయ్య.. నాగార్జునేనా.. కారణం..!!

ప్రస్తుత కాలంలో ఓ స్టార్ హీరో సినిమా విడుదలై సూపర్ హిట్ అయితే ఆ సినిమాకు సంబంధించిన అన్ని లెక్కలు బయటకు వస్తాయి.. బడ్జెట్, బిజినెస్, కలెక్షన్స్, రికార్డ్స్ ,టీజ‌ర్, ట్రైలర్ వ్యూస్ టిఆర్పి రేటింగ్స్.. ఇలా ఆ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం బయటికి వచ్చేస్తుంది.. వీటి కోసం ఆ స్టార్ హీరో అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆ అప్డేట్స్ కోసం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఎంత అప్‌డేట్‌గా ఉందో మనందరికీీ తెలిసిందే. మన సీనియర్ హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వారి టైంలో సినిమా హిట్ అయింది అంటే ఆ సినిమా ఎంత కలెక్షన్ రాబట్టింది, ఎన్ని సెంటర్లో ఎన్ని రోజులు ఆడింది.. వీటిని బట్టే ఆ రోజుల్లో ఆ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో చూసేవారు.

Bangarraju Review | Bangarraju Telugu Movie Review with Rating |  cinejosh.com

ఆ రోజుల్లో వారు ఒకరిని మించి ఒకరు పోటీపడి సినిమాలను తీసి ప్రేక్షకుల ముందుకు వచ్చేవారు. ఇక ఇప్పుడు వాళ్లు సీనియర్ హీరోలైన‌ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ నలుగురు సీనియర్ హీరోల సినిమాలు విడుదలై ప్రేక్షకను ఎంతో బాగా అలరించాయి. ఆ సినిమాలు టెలివిజన్లో ప్రసారమైనప్పుడు హైయెస్ట్ టి ఆర్ పి సాధించిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా కింగ్ నాగార్జున తన తనయుడు నాగచైతన్యతో కలిసి నటించిన సినిమా బంగారు రాజు సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత బుల్లితెర మీద ఈ సినిమా ప్రసారమైనప్పుడు 14 టిఆర్పి రేటింగ్ తెచ్చుకుని సీనియర్ హీరోల సినిమాలలో టాప్ సినిమాగా నిలిచింది.

ఇక తర్వాత నందమూరి బాలకృష్ణ యాక్షన్ సినిమాలు దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో నటించిన మూడో సినిమా ఆఖండ ఈ సినిమా విడుదలై బాలకృష్ణణ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా బుల్లితెర మీద కూడా అదిరిపోయే టిఆర్పి దక్కించుకుంది. ఈ సినిమా ఏకంగా 13.31 టిఆర్పి దక్కించుకుంది. ఇక తరవాత విక్టరీ వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన సినిమా ఎఫ్3 ఈ సినిమాని ఎఫ్2కి సిక్వల్గా అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఎఫ్ 3 సినిమా విడద‌లై సూపర్ హిట్ టాక్ తో అదిరిపోయే కలెక్షన్లను దక్కించుకుంది. ఈ సినిమా బుల్లితెర మీద కూడా 8.26 టిఆర్పి తో సరిపెట్టుకుంది.

ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ తో కలిసి నటించిన సినిమా ఆచార్య. ఈ సినిమాను స్టార్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించాడు. భారీ అంచనాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా.. ఎవరూ ఊహించని విధంగా భారీ డిజాస్టర్ టాక్ తో చిరు కెరియర్ లోని అతిపెద్ద ప్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమా టెలివిజన్ లో ప్రసారమావగా 6.30 టిఆర్పి తో సరిపెట్టుకుంది. ఈ నలుగురి స్టార్ హీరోల్లో బుల్లితెర మీదే బాలకృష్ణ- నాగార్జున టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నారు.