ప్రపంచానికి తెలియని అల్లు అరవింద్ నాలుగో కుమారుడు… ఏమయ్యాడో తెలుసా..!

తెలుగు స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య కుమారుడుగా సినీ రంగ ప్రవేశం చేసిన అల్లు అరవింద్ మొదట కోన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. ఆయనకు నటన కన్నా నిర్మాణరంగం మీద ఎక్కువ మక్కువ ఉండటంతో అల్లు రామలింగయ్య స్థాపించిన గీత ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ ని అల్లు అరవింద్ కి ఇచ్చారు. ఆ తర్వాత ఆ బ్యానర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమంలో గీత ఆర్ట్స్ అగ్ర నిర్మాణ సంస్థగా కొనసాగుతుంది.

Allu Arjun and family congratulate newlyweds Niharika and Chaitanya. Unseen pics - India Today

అల్లు అరవింద్ ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయనకు ముగ్గురు కుమారులు మాత్రమే అని అందరూ అనుకుంటారు. అందులో అల్లు అర్జున్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.. అల్లు శిరీష్ కూడా టాలీవుడ్ లో ఇప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్నాడు. రీసెంట్ గా వచ్చిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాతో అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అరవింద్ కి ఇంకో పెద్ద కొడుకు కూడా ఉన్నాడు.. పేరు అల్లు వెంకటేష్(బాబీ). ఇత‌ను కూడా అల్లు అరవింద్ తర్వాత గీత ఆర్ట్స్ లో ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు. వీరు ముగ్గురే కాకుండా ఇంకో కొడుకు అల్లు అరవింద్ కి ఉన్నారట.. ఇక ఆయన చిన్న వయసులోనే కార్ యాక్సిడెంట్ లో మరణించాడు. ఈ విషయాన్ని అల్లు శిరీష్ తాజాగా రివీల్ చేశాడు.

Allu brothers with mom Nirmala

అల్లు శిరీష్ హీరోగా నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా తాజాగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు శిరీష్… ఈ టాక్ షోలో ఈ సినిమా గురించి తన ఫ్యామిలీ లైఫ్ గురించి పలు విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంలోనే వ్యాఖ్యాతగా ఉన్న ఆలీ ఒక ఎమోషనల్ ప్రశ్నను అడిగాడు… అల్లు అరవింద్ గారిని ఈ ప్రశ్న అడిగితే బాగోదని నేను మిమ్మల్ని అడుగుతున్నా… మీ నాన్నగారికి ఎంతమంది సంతానం అని ఆలీ అడగగా… ‘మొత్తం మేము నలుగురం పెద్దన్నయ్య వెంకటేష్, రెండో అన్నయ్య రాజేష్, అర్జున్, నేను అయితే రాజేష్ అన్నయ్య నేను పుట్టకముందే యాక్సిడెంట్ లో చనిపోయాడని శిరీష్ చెప్పాడు’. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

 

Share post:

Latest