టెలివిజన్ యాంకర్ గా వెండితెరకు పరిచయమై స్టార్ హీరోయిన్గా ఎదిగిన వాణి భోజన్.. తర్వాత బుల్లితెర మీద టీవీ సీరియల్స్ లో నటించి టెలివిజన్ నయనతారగా పేరు తెచ్చుకుంది. ఈమే కోలీవుడ్ లో 97, అధికారం సినిమాలతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత కడవలే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత వరుస సినిమాలో నటించి మంచి నాటిగాడపేరుపొందింది. తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కు జోడిగా మహన్ చిత్రంలో నటించింది.
కోలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ వరుసగా పది చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు వాణి భోజన్ కోలీవుడ్ హీరో జయ్తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె నటించే సినిమాల కథలను ఆయనే ఎంపిక చేస్తున్నట్టు దర్శక, నిర్మాతలు ఈ ముద్దుగుమ్మ ను కలుసుకోవడానికి అవకాశం కూడా లేదని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. అయితే ఇప్పుడు ఈ ప్రచారంపై ఈ ముద్దుగుమ్మ ఆలస్యంగా స్పందించింది. అలాంటి వార్తలు తన దగ్గరకు వచ్చాయని అయితే అవన్నీ ఫేక్ న్యూస్ అని కొట్టు పడేసింది. వాణి భోజన్ రీసెంట్గా భరత్ కు జంటగా మిరిల్ సినిమాలో నటించింది.
ఈ సినిమా ఈనెల 11న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమే మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నేను డబ్బు కోసమే లేక దర్శక- నిర్మాతల కోసమో సినిమాలలో నటించడం లేదని.. సినిమా కథలను నేనే విని నచ్చిన వాటిలోనే నేను నటిస్తున్నట్లు తెలిపింది. అంతేకానీ తొందరపడి చిత్రాలకు ఒప్పుకోవడం లేదని స్పష్టం చేసింది. హిందీలో వచ్చిన గంగుభాయ్ వంటి సినిమాలో నటించాలని కోరుకుంటున్నట్లు వాణి భోజన్ చెప్పుకొచ్చింది.