బాలయ్య ‘ వీరసింహారెడ్డి ‘ పై ఓ క్రేజీ అప్‌డేట్ వ‌దిలిన థ‌మ‌న్‌…!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ – దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమా తెర‌కెక్కుతోన్న విష‌యం మనకు తెలిసిందే. రీసెంట్గా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, టైటిల్ అనౌన్స్మెంట్ మోషన్ పోస్టర్ అన్నీ ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెంచేశాయి. ఇక ఈ సినిమాకి థ‌మన్ సంగీతం అందిస్తున్నాడు. బాలకృష్ణకి జోడిగా క్రేజీ ముద్దుగుమ్మ శృతిహాసన్ నటిస్తుంది.

అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్ష‌కుల‌ ముందుకు రాబోతుంది. ఇక దీంతో ఈ సినిమా నుండి వరుస అప్డేట్లు ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. అతి త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవుతుంద‌ని సంగీత దర్శకుడు థ‌మన్ తన సోషల్ మీడియా ఎకౌంటు ద్వారా బాలయ్య అభిమానులతో పంచుకున్నాడు. ఈ వార్తతో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాడు.

అఖండ సినిమా కోసం బాలయ్య మాములు కష్టం పడలేదు.. థమన్ కామెంట్స్ వైరల్ ?>

ఈ క్రమంలోనే ఫస్ట్ సాంగ్ కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే విడుదల చేయనున్నారని తెలుస్తుంది. థ‌మన్ గతంలో బాలయ్యతో అఖండ సినిమా చేశాడు. ఆ సినిమా ఎంత ఘ‌న విజ‌యం సాధించిందో మనందరికీ తెలిసిందే..! ఈ సినిమా కూడా మరో సెన్సేషనల్ హిట్ అవుతుందని బాలయ్య అభిమానులు ఎన్నో భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Share post:

Latest