ఆ రోజు రాత్రి ప్ర‌భాస్ చేసిన ప‌ని ఎప్ప‌టికీ మ‌ర్చిపోను.. సూర్య షాకింగ్ కామెంట్స్‌!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. భారీ సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ, స్టార్ హోదాలో కొనసాగుతున్నప్పటికీ ప్రభాస్.. తోటి నటీనటులను ఎంతగానో గౌరవిస్తాడు. మరియు అభిమానిస్తాడు. ఇక ప్రభాస్ ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఒక్కసారి ఆయన ఆతిథ్యం రుచి చూశారంటే జీవితంలో మరిచిపోలేరు.

అయితే ప్రభాస్ కు సంబంధించి ఎవరికీ తెలియని ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్నీ పంచుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య‌.. ప్రభాస్ గురించి ప్రస్తావన రాగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. సూర్య మాట్లాడుతూ.. “ఒకసారి నేను, ప్రభాస్.. హైదరాబాద్ లో ఒకే చోట షూటింగ్ చేశాం. ఓ రోజు ఆయ‌న షూటింగ్ అవ్వ‌గానే డిన్నర్ కు కలిసి వెళ్దాం అన్నాడు. వెయిట్ చేస్తానని చెప్పాడు. అయితే ఆ రోజు నా సినిమా షూటింగ్ ఆలస్యమైంది. దాదాపు రాత్రి 11:30 అయిపోయింది.

దీంతో ప్రభాస్ ని ఇబ్బంది పెట్ట‌డం ఎందుకులే అని.. ఏదైనా హోటల్, ప్రొడక్షన్ మెస్ లో తినేద్దాం అని మనసులో అనుకున్నాను. కానీ నేను షూటింగ్ ఫినిష్ చేసి బ‌య‌ట‌కు వ‌చ్చే వ‌ర‌కు ప్ర‌భాస్ వేయిట్ చేస్తూనే ఉన్నాయి. నేను రాగానే `సర్ నేను రెడీ. మీరు స్నానం చేసి వస్తే భోజనం చేద్దాం` అన్నాడు ప్ర‌భాస్‌. ఆ రోజు నేను ఎప్ప‌టికీ మ‌ర్చిపోను“ అంటూ సూర్య చెప్పుకొచ్చాడు. రాత్రి అంత లేట్ అయినా ప్ర‌భాస్ త‌న‌కోసం వెయిట్ చేశాడ‌ని, తన ఇంటి నుండి బిర్యానీ తెప్పించాడ‌ని సూర్య పేర్కొన్నాడు. అలాగే ప్ర‌భాస్ వ్య‌క్తిత‌త్వం, అత‌డు తోటి నటీనటులకు ఇచ్చే గౌర‌వం త‌న‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయ‌ని సూర్య తెలిపాడు.

Share post:

Latest