జ‌పాన్ లో `ఆర్ఆర్ఆర్‌` బీభ‌త్సం.. 30 రోజుల్లో ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబోలో వ‌చ్చిన బిగ్గెస్ట్ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ల పై డివివి దాన‌య్య భారీ బ‌డ్జెట్ తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు.

ఇందులో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తే.. రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ, స‌ముద్ర‌ఖ‌ని త‌దితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఎన్నో వాయిదాల అనంత‌రం ఈ ఏడాది మార్చి 25న విడుద‌లైన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. విడుద‌లైన అన్ని భాష‌ల్లోనూ కాసుల వ‌ర్షం కురిపించి.. ఎన్నో రికార్డుల‌ను సైతం నెల‌కొల్పింది. ఇక ఇటీవ‌ల ఈ చిత్రాన్ని జ‌పాన్ లో రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

జపాన్ లో చాలా తక్కువ సంఖ్యలోనే తెలుగు ఆడియన్స్ ఉన్నారు. అయినాస‌రే ఈ చిత్రానికి అక్క‌డ అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో జ‌పాన్ బాక్సాఫీస్ ను షేక్ చేసి ఆర్ఆర్ఆర్ బీభ‌త్సం సృష్టించింది. రిలీజ్ అయిన 30 రోజుల్లోనే 300 మిలియన్ల జపాన్ యోన్ ల క్లబ్ లో చేరింది. అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే రూ. 18 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింద‌ని చెప్పొచ్చు. అంతేకాదు, జ‌పాన్ లో 300 మిలియన్ల క్లబ్లో అత్యంత వేగంగా చేరిన తొలి భారతీయ చిత్రంగా `ఆర్ఆర్ఆర్‌` రికార్డును సైతం సృష్టించింది.