సక్సెస్.. సూపర్ సక్సెస్.. ఫలించిన రాజమౌళి కల..!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు యస్ యస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ పాన్ ఇండియా సినిమా త్రిబుల్ ఆర్ అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్‌ను అందుకుంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా జపాన్‌లో రిలీజ్ చేయగా అక్కడ కూడా సాలిడ్ ప్రమోషన్స్ నడుమ భారీ లెవల్లో విడుదలైంది.

ఇప్పుడు ఈ సినిమాకి అక్కడ అంతకంతకు ఆదరణ పెరుగుతూ వస్తుడం విశేషం. ఈ సినిమా విడుద‌లై 21 రోజు అయినా కూడా మొదటి రోజు కన్నా 21వ‌ రోజు కలెక్షన్లు అధికంగా వస్తున్నట్లు చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసింది. ఇక ఇప్పుడూ దీంతో ఈ చిత్రం అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. రీసెంట్ కలెక్షన్ తో త్రిబుల్ ఆర్ సినిమా జపాన్‌లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా ఫైనల్ రన్ ఎంత వరకు వెళ్తుందో ఎక్కడ ఆగుతుందో వేచి చూడాల్సిందే.

Share post:

Latest