టాలీవుడ్ లోకి ఎన్టీఆర్ నట వారసుడుగా బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. అయినప్పటికీ బాలయ్య యువ హీరోలకు పోటీగా తన సినిమాలను విడుదల చేస్తూ మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఇక బాలయ్య సినిమా కేవలం తెలుగులోనే కాకుండా పలు విదేశీ ప్రాంతాలలో కూడా బాగా ఆకట్టుకుంటుంటాయని చెప్పవచ్చు. బాలయ్య కెరియర్లో తన రేంజ్ ను పెంచిన చిత్రాలలో భైరవద్వీపం సినిమా కూడా ఒకటి. ఈ చిత్రం బాలకృష్ణ నటనపరంగా స్టార్డం అని తెచ్చి పెట్టిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఈ చిత్రం 1994వ సంవత్సరంలో విడుదలై అన్ని సెంటర్లు సూపర్ టాక్ తో మంచి విజయ దిశగా దూసుకుపోయింది.
ఈ చిత్రానికి ఏకంగా తొమ్మిది నంది అవార్డులు కూడా రావడం జరిగిందట. జానపద చిత్రంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాలయ్యకు జోడిగా హీరోయిన్ రోజా నటించారు. ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమా సెన్సార్ విషయంలో అప్పట్లో పలు ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకున్నాయట. ఈ సినిమాకి ముందుగా సెన్సార్ జరిగిపోయిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతేకాకుండా అలాంటి సమయంలోనే చిత్ర బృందానికి సెన్సార్ వారు ఒక వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది.
ఈ చిత్రంలోని గుర్రాలకు బాణాలు తగిలి కింద పడే కొన్ని సన్నివేశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.అయితే ఆ సన్నివేశాలపై సెన్సార్ సభ్యులు చాలా అభ్యంతరం తెలుపుతూనే సినిమాలలో గుర్రాలకు బాణాలు తగిలి కింద పడిపోతున్న సన్నివేశాలు ఉన్నాయి.. ఆ సన్నివేశాలకు అటవీ వాళ్లు, బ్లాక్రాస్ వాళ్ళు అభ్యంతరం తెలిపితే మాత్రం ఈ చిత్రంలోని సన్నివేశాలను తొలగించాల్సి ఉంటుందంటూ వార్నింగ్ ఇచ్చారట. అయితే ఈ సినిమా విడుదలై మంచి విజయ దిశగా దూసుకుపోతున్న సమయంలో ఈ విషయాలను ఎవరూ పట్టించుకోలేదు.