సూపర్ స్టార్ మహేష్ బాబు వల్ల రానా వంద కోట్లు నష్టపోవటం ఏంటి..? పైన టైటిల్ చూసిన వెంటనే అందరి మైండ్లో వచ్చే ప్రశ్నన ఇదే. ఈ విషయం ఏంటో తెలుసుకోవాలంటే మనం 2004 కి వెళ్ళాలి. ఆ రోజుల్లో గజిని సినిమా కథను రెడీ చేసుకుని హీరో కోసం వెతుకులాట మొదలుపెట్టాడు దర్శకుడు మురగదాస్. ఇక అప్పటికి రానా ఇంకా హీరోగా పరిచయం కాలేదు. తన తండ్రి సురేష్ బాబు నిర్మించే సినిమాల కథల డిస్కషన్ల విషయంలో చురుగ్గా పాల్గొనేవాడు. అదే టైంలో ఒకరోజు చెన్నై నుండి సురేష్ బాబుని కలవడానికి మురగదాస్ వచ్చాడు.
సురేష్ బాబు కి గజిని కథ వినిపించడానికి టాలీవుడ్ లో అడుగు పెట్టాడు మురగదాస్. ఇక అప్పుడు సురేష్ బాబు తో పాటు రానా కూడా ఈ కథ విన్నారు. వారిద్దరికీ ఈ కథ బాగా నచ్చింది. అప్పుడు వెంటనే సురేష్ బాబు ఈ కథ చేయడానికి తెలుగు హీరోలు ఎవరు ఇంట్రెస్ట్ చూపరు. కాని సినిమా చేస్తే సూపర్ హిట్ అవుతుందని మొహమాటం లేకుండా చెప్పేసాడు. అప్పుడు రానా ఈ సినిమా మహేష్ బాబుతో చేస్తే బాగుంటుందని.. ఇప్పటికే ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నాడని కూడా అన్నాడు. మహేష్ బాబు అతడు, పోకిరి వంటి బ్లాక్ పాస్టర్ హిట్ సినిమాలలో ఇంకా నటించలేదు.
నిజం- నాని వంటి ప్రయోగాత్మక సినిమాల్లో నటించాడు. ఇక రానా అందుకే మహేష్ బాబు ఈ సినిమాలో నటిస్తే బాగుంటుందని వివరించాడు. మురగదాస్ మహేష్ ను కలవగా ఇలాంటి స్టోరీలు తెలుగు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపారు చేస్తే వేరే భాషల హీరోలు చేయాలని మొహమాటం లేకుండా చెప్పేశాడు. రానాకు గజినీ కథ నచ్చడంతో ఎలాగైనా ఈ సినిమా రైట్స్ కోనలని ప్రయత్నాలు చేశాడు. కానీ తెలుగు హీరోలు ఎవరూ స్టోరీ మీద ఇంట్రెస్ట్ చూపించక పోవడంతో రానా తన ఆలోచనను వదులుకున్నాడు.
తర్వాత గజినీ సినిమాను మురగదాస్ సూర్యాతో తీసి అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తర్వాత తెలుగు రైట్స్ ను అల్లు అరవింద్ కొన్నాడు. ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేయగా అక్కడ అమీర్ ఖాన్ నటించిన ఈ సినిమా అక్కడ కూడా 100 కోట్ల కలెక్షన్ సాధించి సూపర్ హిట్గా నిలిచింది. ఇక మహేష్ బాబు వల్ల రానా 100 కోట్ల వసూలు రాబట్టే సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.