రౌడీ హీరో విజయ్ దేవరకొండ కి అదిరిపోయే ఆఫర్… సూపర్ స్టార్ కొడుకుగా విజయ్..!!

పెళ్లిచూపులు సినిమాతో హీరోగా టాలీవుడ్‌కు పరిచయమైన విజయ్ దేవరకొండ.. తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ హీరోగా టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో మరో లెవల్ కి వెళ్ళాడు విజయ్.. ఇక ఆ సినిమా తర్వాత నుంచి విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు హిట్ అవ్వలేకపోయాయి.. పాన్ ఇండియా లెవెల్ లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన సినిమా లైగర్.. ఈ సినిమా విజయ్ కెరియార్ లోనే అత్యంత ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది.

లైగర్ సినిమా వాళ్ళ విజయ్ కెరియర్ కు డామేజ్ ఎక్కువగా అయినా.. ఆయన క్రేజ్ ఎంత మాత్రం ఎక్కడా తగ్గలేదు. ప్రస్తుతం విజయ్‌ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో బిజీగా ఉన్నాడు.. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్గా నటిస్తుంది. లైగర్ సినిమా హిట్ అవ్వకపోయినా విజయకు పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్‌ను తీసుకు వచ్చింది. ఈ క్రమంలోనే విజయ్ తెలుగు-మలయాళ బై లాంగ్వేజ్ సినిమాలో నటించబోతున్నాడట.

Kushi first look : Kashmiri based Love story? - Cine Chit Chat

అయితే మలయాళంలో ఆగస్టులో ప్రకటించిన వృషభలో విజయ్ దేవరకొండ మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ కొడుకుగా నటించబోతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా దర్శకుడు నందకిషోర్ రౌడీ హీరోతో ఈ సినిమాకు సంబంధించిన పాత్ర గురించి చర్చలు జరిపినట్టు కూడా తెలుస్తుంది. ఈ విషయం గురించి ఈ సినిమా యూనిట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. మోహన్ లాల్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ సినిమాలు పూర్తయిన వెంట‌నే ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా వృషభ షూటింగ్లో పాల్గొననున్నాడు.

Mohanlal, Vijay Deverakonda to team up as father and son in period action drama Vrushabha?

ఈ సినిమాను మలయాళం మరియు తెలుగులో కూడా ఒకేసారి తెరకెక్కించనున్నారు. ఇక ఈ సినిమాను 2024లో ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు అని తెలుస్తుంది. ఈ సినిమా ప్రధానంగా తండ్రి కొడుకులు మధ్య జరిగే యాక్షన్ డ్రామా కథగా తెర‌కెక్క‌బోతుంది అని తెలుస్తుంది. ఈ సినిమాతో అయినా విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హిట్ కొడతాడో లేదో చూడాలి.

Share post:

Latest