ఈ అవుట్ డేటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ల పని అయిపోయినట్టేనా ఇక?

ఏ ఇండస్ట్రీలో అయినా సీనియర్స్ అవుట్ డేటెడ్ సినిమాలు తీసుకుంటూ వెళ్ళినపుడు అలాంటివారిని సినిమా ప్రేక్షకులు అవుట్ డేటెడ్ డైరెక్టర్లు అని అంటారు. అదే విధంగా మన తెలుగు పరిశ్రమలో కూడా అలాంటివారు లేకపోలేదు. సహజంగా కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు కొట్టుకుపోవడం సహజమే. అయితే కొంతమంది విషయంలో ఈ మాటలు వర్తించవు. ఉదాహరణకు పూరి జగన్నాధ్, రాజమౌళి లాంటి వారు. ఇక మన తెలుగులో అవుట్ డేటెడ్ దర్శకులు అంటే ముఖ్యంగా శ్రీను వైట్ల, వివి వినాయక్, విజయ భాస్కర్ లాంటివాళ్లను ఎక్కువగా చెప్పుకోవచ్చు.

శ్రీను వైట్ల సినిమా కెరీర్ గత కొన్నేళ్లుగా ఆశించిన విధంగా సాగడం లేదు. హిట్లు మీద హిట్లు వస్తున్నాయని కాదాయని ఒకే తరహా సినిమాలు తీయడంతో జనాలు బోర్ ఫీలై వాటిని వరుసగా రిజెక్ట్ చేశారు. దాంతో వరుస సినిమా ఫ్లాప్స్ రావడంతో.. సైలెంట్ అయిపోయాడు శ్రీను. అయితే ప్రస్తుతం ఈయన గోపించంద్ హీరోగా ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడని తెలుస్తోంది కానీ అది ప్రకటనకే పరిమితమైంది. అలాగే తెలుగులో ప్లాప్ డైరెక్టర్ గా ముద్రపడిపోయిన మరో దర్శకుడు మెహర్ రమేష్. ‘షాడో’ తర్వాత మరో సినిమా రమేష్ నుండి రాలేదు.

అయితే ఇన్నేళ్లకి మరలా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో ‘వేదలమ్’ సినిమాని “భోళా శంకర్” పేరుతో రీమేక్ చేస్తున్నాడు. చూడాలి మరి, ఈ సినిమాతో అన్నా జాతకం మారుతుందేమో. ఆ తరువాత మాస్ అండ్ కమర్షియల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వి.వి. వినాయక్ గురించి మాట్లాడుకొవాలి. కొన్నేళ్లుగా వినాయక్ బాగా సైలెంట్ అయిపోయారు. ఒకప్పుడు స్టార్ హీరోలందరితో బ్లాక్ బస్టర్స్ తీసిన దర్శకుడు.. ‘ఇంటెలిజెంట్’ ఫ్లాప్ తర్వాత మరో చిత్రాన్ని తీయలేదు. చివరగా స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి వంటి హిట్ సినిమాలు తీసిన దర్శకుడు కె విజయ్ భాస్కర్ కూడా చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్నారు. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి.