తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోలలో ఒకరైన సూపర్ స్టార్ కృష్ణ నిన్న ఉదయం మరణించిన విషయం మనకు తెలిసిందే. ఈరోజు ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో వేలాదిమంది అభిమానుల సమక్షంలో హైదరాబాద్లోని మహ ప్రస్థానంలో జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇతర సినీ పరిశ్రమ నటులపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణకు సరైన నివాళి ఇవ్వలేదంటూ.. ఆయనను చూడడానికి వచ్చేందుకు కూడా టైం లేదా… కనీసం ట్విట్టర్లోను నివాళి పోస్ట్లు పెట్టేందుకు కూడా ఖాళీ లేదా.. అంటు నెటిజన్లు తీవ్రస్థాయిలో నిలదీస్తున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ చనిపోతే హైదరాబాద్ రావడానికి తీరిక లేదా అని మండిపడుతున్నారు. కమలహాసన్, రజనీకాంత్ తప్ప మిగతా ఏ ఇండస్ట్రీ హీరోలు కూడా ఒక పోస్ట్ పెట్టలేదు అంటున్నారు. ప్రతి సంవత్సరం తెలుగులో ఎన్నో డబ్బింగ్ సినిమాలు విడుదలవుతున్నాయి. అవి విడుదలయ్యే సమయంలో ప్రమోషన్స్ భారీ స్థాయిలో జరుగుతాయి.. ఆ ప్రమోషన్స్ లో ఇతర భాష నటులు భారీ డైలాగులతో సినిమాను మించి ఉంటాయి. అంతేకాకుండా మాకు తెలుగు భాష అంటే ఇష్టం తెలుగు ప్రజలను మేము ఎంతగానో ఇష్టపడుతున్నాము అంటూ సొల్లు కబుర్లు చెబుతూ వారి సినిమాను ప్రమోట్ చేసుకుంటారు.
ఇప్పటివరకు ఎన్నో డబ్బింగ్ సినిమాలు విడుదలై సూపర్ హిట్ సినిమాలుగా నిలిచాయి. ఇతర భాషల నటుల్ని కూడా మన ప్రేక్షకులు ఆదరించారు. ఇదంతా బాగానే ఉంది కానీ తెలుగు హీరోలు ఎవరైనా చనిపోతే వారిని సరిగ్గా పట్టించుకోవటం లేదని నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. కనీసం ట్విట్టర్ ద్వారా కూడా వారికి సంతాపం ప్రకటించడానికి ఖాళీ లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. కమలహాసన్, రజినీకాంత్ తప్ప మిగతా ఏ హీరో కూడా కృష్ణకు నివాళులు అర్పించలేదు అంటున్నారు. సినిమా హిట్ అవటం కోసం చేసే ప్రమోషన్ల పై ఉన్న శ్రద్ధ తెలుగు హీరోలపై లేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
గతంలో ఎప్పుడైనా ఇతర భాషా నటలు చనిపోతే మన తెలుగు నటులు వారి రాష్ట్రానికి వెళ్లి వారికి నివాళులు అర్పించారు. అలా కుదరని పక్షంలో ట్విట్టర్లో వారికి నివాళులు అర్పించారు. ఇప్పుడు ఈ విషయాలని నెటిజన్లు గుర్తు చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఇతర భాష నటులపై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.