ప్ర‌భాస్ సినిమాలో ఆర్జీవీ గెస్ట్ రోల్‌.. ఈ ట్విస్ట్ ఎవ‌రూ ఊహించి ఉండ‌రు!?

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో వివాస్ప‌ద‌ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారట. నిజంగా ఈ ట్విస్ట్ ను ఎవరూ ఊహించి ఉండరు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ప్రాజెక్ట్ కె` ఒకటి. జాతీయ అవార్డు గ్రహీత నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇందులో దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, హీరోయిన్ దిశా పటానీ తదితరులు కీలక పాత్రను పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యాన‌ర్ల‌పై హై బ‌డ్జెట్ తో పాన్ వ‌ర‌ల్డ్ స్థాయిలో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది అక్టోబర్ లో లేదా 2024 సంక్రాంతికి విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

ram gopal varma in prabhas movie
ram gopal varma in prabhas movie

అదేంటంటే ఈ చిత్రంలో ఆర్జీవి గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారట. ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు కూడా జరిపారని.. ప్రభాస్ సినిమాలో నటించేందుకు వ‌ర్మ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. త్వరలోనే వర్మ షూటింగ్ పార్ట్ ను కూడా పూర్తి చేయబోతున్నారట. అయితే ఈ వార్త ఎంత వరకు నిజం..? అసలు నిజమైతే ప్రాజెక్ట్ కె లో వర్మ ఎలాంటి రోల్ లో కనిపిస్తారు..? అన్న ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

Share post:

Latest