టాలీవుడ్ లో అందాల రాక్షసి చిత్రం ద్వారా మొదటిసారి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. తన మొదటి చిత్రంతోనే మంచి సక్సెస్ అందుకోవడంతో ఆ తర్వాత యంగ్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. నానితో కలిసి ఒక సినిమా నాగచైతన్యత మరొక సినిమా నటించి మంచి విజయాలను అందుకుంది. అయితే ఆ తర్వాత సినిమా కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో ఈ అమ్మడు ప్రస్తుతం వరుస ప్లాపులతో సతమతమవుతోంది. చివరిగా ఈమె నటించిన చిత్రం హ్యాపీ బర్తడే. ఈ చిత్రం మీద కూడా మంచి హోప్స్ ఉన్నప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
దీంతో లావణ్య త్రిపాఠి కెరియర్ ముగిసిందని వార్తలు బాగా వినిపించాయి. అయితే ఈ సినిమా తర్వాత ఇమే ఎలాంటి ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కూడా చేయలేదు కానీ.. ప్రస్తుతం లావణ్య వరుస ప్రాజెక్టులకు బిజీగా ఉంటోంది అంటూ వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి. పలు వెబ్ సిరీస్ లతోపాటు పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. తమిళంలో కూడా హీరో ఆధ్వర కు జోడిగా ఒక చిత్రంలో నటిస్తోంది. అలాగే జీ తెలుగు తెరకెక్కిస్తున్న ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రెండు సినిమా షూటింగ్ కూడా చివరి దశలో ఉన్నట్లు సమాచారం.
ఇక వీటితోపాటు మంజునాథ దర్శకత్వంలో ఒక చిత్రం ఇవే కాకుండా.. మరొక రెండు ప్రాజెక్టులు ఉన్నాయని సమాచారం. అయితే ఇంత బిజీగా ఉన్నప్పటికీ లావణ్య తమ ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి అప్డేట్ బయటపెట్టుకపోవడంతో అభిమానులు కాస్త నిరుత్సాహ చెందుతున్నారు. అయితే లావణ్య కెరియర్ క్లోజ్ అయిందని వార్తలు వస్తున్నప్పటికీ ఈమె చేతిలో సినిమాలు ఉండడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. మరి వీటితోనైనా సక్సెస్ అవుతుందేమో చూడాలి.