థియేట‌ర్స్‌లో సంద‌డి చేసేందుకు `పుష్ప‌`రాజ్ సిద్ధం.. ట్విస్ట్ అదిరిందెహే!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ చిత్రం `పుష్ప ది రైజ్`. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. అలాగే మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా చేశారు.

గత ఏడాది డిసెంబర్ 17న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇందులో పుష్ప రాజ్ పాత్ర‌లో బన్నీ లుక్ పరంగానే కాకుండా నటన మరియు డైలాగ్ డెలివరీతోనూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు రెండో భాగంగా `పుష్ప ది రూల్‌` రాబోతోంది. ఇటీవ‌లె ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ఇదిలా లా ఉంటే పుష్ప రాజ్‌ మళ్ళీ థియేటర్లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఇక్క‌డ అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే.. థియేటర్స్ లో రిలీజ్ అయ్యేది పుష్ప ది రూల్‌ కాదు పుష్ప ది రైజ్‌. లేటెస్ట్ బజ్ ప్రకారం.. పుష్ప ది రైజ్‌ ను కేరళలో రీ రిలీజ్ చేసేందుకు అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ సినిమా విడుదలై డిసెంబర్ 17 కు ఏడాది కావస్తున్న సందర్భంగా మ‌ళ్లీ విడుద‌ల చేయాలని డిసైడ్ అయ్యారట. అధిక సంఖ్యలో స్క్రీన్స్ కూడా అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి రీ రిలీజ్ లో పుష్ప రాజ్‌ ఎలాంటి రికార్డుల‌ను క్రియేట్ చేస్తాడో చూడాలి.

Share post:

Latest