పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ చిత్రాల్లో `ప్రాజెక్ట్ కె` ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, దిశా పటాని తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.
వైజయంతి మూవీస్ బ్యానర్ పై హై బడ్జెట్ తో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరబాద్ లో శర వేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే మేకర్స్ త్వరలోనే ఓ భారి యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట.
ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం ఇప్పటికే నాలుగు భారీ సెట్స్ ను నిర్మించారట. అలాగే హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ ను రంగంలోకి దింపుతున్నారట. ఇక ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్ పెడుతున్నారట. ఏదేమైనా ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసమే అంత బడ్జెట్ పెట్టడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది ఆఖరిలో లేదా 2024 సమ్మర్లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.