తెలుగు చిత్ర పరిశ్రమకి సంక్రాంతి సీజన్ చాలా విలువైనది. ఆ పండగకి విడుదలైన సినిమాలు కచ్చితంగా హిట్ అవుతాయని టాలీవుడ్ నిర్మాతల్లో గట్టి నమ్మకం ఉంటుంది. ఇక వచ్చే సంక్రాంతికి కూడా భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక టాలీవుడ్ అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, దళపతి విజయ్, సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే సంక్రాంతి విడుదల కాబోయే సినిమాల గురించి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈరోజు ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది.
మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలుగు సినిమాలకి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, ఈ సినిమాలు తర్వాత మిగిలిన థియేటర్లకే డబ్బింగ్ సినిమాలు ఇవ్వాలని ప్రొడ్యూసర్ కౌన్సిల్ పేర్కొంది. ఈ క్రమంలోనే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి గట్టి షాక్ అనే చెప్పాలి. తెలుగు స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్ వస్తున్న వారసుడు సినిమాలో కోలీవుడ్ హీరో విజయ్ నటిస్తున్నాడు.. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా ఈ సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.
ఇక దర్శకుడు ఈ సినిమాని తమిళ్ నేటివిటీకి తగ్గట్టు తెరకెక్కిస్తున్నాడని చెప్పడంతో.. ఇది డబ్బింగ్ సినిమాలు జాబితాలో చేరింది. ప్రొడ్యూసర్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంతో దిల్ రాజు చిక్కుల్లో పడ్డాడు. ఈ విషయంపై దిల్ రాజు ఎలా స్పందిస్తాడు అనేది తెలియాల్సి ఉంది. ప్రొడ్యూసర్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంతో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు అత్యధిక థియేటర్లో విడుదలకు సిద్ధమవుతున్నాయి.