సినీ ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరు కూడా టాలీవుడ్ పరిశ్రమకు రెండు కళ్ళు లాంటివారని చెప్పవచ్చు. తాజాగా ప్రముఖ నటుడు నిర్మాత చిట్టిబాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సీనియర్ ఎన్టీఆర్ తన సినిమాలన్నీ ఎక్కువగా హైదరాబాదులోనే పలు ఏరియాలలో తీసేవారట. అందుకోసం రామకృష్ణ స్టూడియోస్ కట్టి హైదరాబాదులోని సినిమా షూటింగ్ చేసే వారిని చిట్టిబాబు తెలియజేశారు. ఇక ఏఎన్నార్ గారు కూడా తన సినిమాలన్నీ హైదరాబాదులోనే షూటింగ్ చేయాలని మద్రాస్ నుంచి హైదరాబాద్ కు వచ్చేసారని తెలిపారు చిట్టిబాబు.
ఇలా వీరిద్దరూ కూడా మొదటి సారి హైదరాబాదులో షూటింగ్ జరగాలని అడుగులు వేసిన నటులని తెలిపారు. ఇక అంతే కాకుండా మనం ప్రేక్షకుల డబ్బు తింటున్నామని ఏపీలో కూడా ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధి చేయవలసింది అని చిట్టిబాబు తెలియజేశారు. టాలీవుడ్లో స్టార్ హీరోలు ఈ దిశగా అడుగులు వేయాలని ఉన్నా కూడా.. ఎందుకు వేయలేకపోతున్నారని తెలియజేశారు. ముఖ్యంగా నిర్మాతలు, హీరోలు ఒక అడుగు ముందుకు వేస్తే అందరూ కూడా ఆ వైపుగా నడుస్తారని తెలియజేశారు చిట్టిబాబు. ఇక హీరోలు సైతం ఒక సినిమాని ఆంధ్రాలో ఒక సినిమాని తెలంగాణలో చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయంగా తెలియజేశారు.
ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధి కోసం సినిమా సెలబ్రిటీలు అడుగులు వేస్తే ఏపీ ప్రభుత్వం కూడా అందుకు సహాయం చేస్తుందని కూడా తెలియజేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా సినిమా షూటింగ్ కోసం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా అనుమతిస్తామని కూడా తెలియజేశారని తెలిపారు. ఇక ఎన్టీఆర్ ,ఏఎన్ఆర్ మద్రాసు నుంచి హైదరాబాద్కు వచ్చినట్లుగా ఇప్పటి స్టార్ హీరోలు సైతం అలా అడుగులు వేయలేదని కామెంట్ చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అవుట్డోర్ సినిమా షూటింగ్ చేస్తే బాగుంటుందని తెలిపారు.