ప్రభాస్ ప్రాజెక్ట్ కే కోసం.. వారికి భారీ ఆఫర్స్… చిత్ర యూనిట్ ఆశలు ఫలించేనా..!?

బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ సినిమాలా తర్వాత వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీపై యుద్ధం ప్రకటించారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో ఓ సినిమా మాత్రం పాన్ వరల్డ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతుంది. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నిర్మిస్తుంది.

Prabhas' Project K Release Date | Project K News

నాగశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ప్రాజెక్టుకే అనే టైటిల్‌ని కూడా పెట్టారు. ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఉన్న ఎందరో అగ్ర తారలు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు సగభాగం పూర్తయింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి అదిరిపోయే ఒక అప్డేట్ బయటకు వచ్చింది. తాజాగా ఈ సినిమా మేకర్స్ ఒక కీలక ప్రకటన రిలీజ్ చేశారు. ప్రాజెక్టుకే సినిమాలు కెమికల్ ఇంజనీర్స్ , స్పెషల్ ఎఫెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవారు లేదా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయడానికి ఇష్టపడే వారి కోసం ప్రాజెక్ట్ కే మేకర్స్ ఒక కీలక ప్రకటన విడుదల చేశారు.

Project K' makers have a special birthday wish for Amitabh Bachchan - News  - IndiaGlitz.com

వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా ఈ ఆఫర్ ను అందుకోండి అని ఆ ప్రకటనలో ఉంది. ఇప్పుడు ప్రభాస్ సినిమాకు పనిచేసే అవకాశం ఎవరు అందుకుంటారో చూడాలి. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే నటిస్తుంది మరియు బాలీవుడ్ దిగ్గజ న‌టుడు అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం ప్రేక్షకులు ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనీట్ ప్రయత్నాలు చేస్తుంది.

 

Share post:

Latest