టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో దేశముదురు సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హన్సిక ..ఆ తర్వాత హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తెలుగు ఇండస్ట్రీలో బడా స్టార్స్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది . కాగా టాలీవుడ్ కంటే కోలీవుడ్ లోనే ఎక్కువ అవకాశాలు సంపాదించుకున్న యాపిల్ బ్యూటీ.. ప్రజెంట్ అక్కడ టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలుతుంది .
కాగా రీసెంట్ గానే తన కాబోయే భర్తను అఫీషియల్ గా పరిచయం చేసింది హన్సిక . జైపూర్ లోని ముంటోడా ప్యాలెస్ లో హన్సిక వివాహం జరగనున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియా వేదికగా తన ఫియాన్సీని అభిమానులకు పరిచయం చేసిన హన్సిక ..వాళ్ళు పారిస్ ఈఫిల్ టవర్ దగ్గర దిగిన ఫొటోస్ ను షేర్ చేసి అభిమానులకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది . హన్సిక కాబోయే వరుడు పేరు సొహెల్ కతూరియా.. ఇతడు ముంబైలో పెద్ద బిజినెస్ మ్యాన్. కోట్లకు అధిపతుడు.
కాగా హన్సిక పెళ్లికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . నయనతార లాగే హన్సిక పెళ్లి కూడా ఓ ప్రముఖ ఓటిటి సంస్థకు లైవ్ టెలికాస్ట్ ఇచ్చేలా ప్లాన్ చేసిందట . ఇప్పటికే ఈ మేరకు ఒప్పందం జరిగినట్లు తెలుస్తుంది . అంతేకాదు దీనికోసం హన్సిక ఏకంగా 10 కోట్ల డీల్ మాట్లాడుకుందట. హన్సిక రేంజ్ కి ఈ రేట్ చాలా ఎక్కువ . కానీ వరుడు సోహెల్ బ్యాక్ గ్రౌండ్ ఆధారంగా ఇంత భారీ రేటుకు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. మనకు తెలిసిందే నయనతార వివాహ వేడుక విషయంలో కూడా నెట్ ఫ్లిక్ సంస్థ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. హన్సిక కాబోయే భర్తకు ఇదివరకే పెళ్లయింది . ఇది ఆయనకు రెండో పెళ్లి . అతనికి ఆల్రెడీ పెళ్లి అయ్యి డివోర్స్ జరిగినట్లు తెలుస్తుంది . షాకింగ్ విషయం ఏంటంటే సోహెల్ మాజీ భార్య హన్సిక బెస్ట్ ఫ్రెండ్ కావడం విశేషం.