ఎన్టీఆర్‌-య‌ష్‌ ల‌కు కొత్త త‌ల‌నొప్పి.. వీరి కష్టం పగవారికి కూడా రాకూడదు!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కన్నడ స్టార్ యష్ లకు ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ నుంచి చివరిగా వచ్చిన చిత్రం `ఆర్ఆర్ఆర్`. దర్శక ధీరుడు రాజమౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో తన 30వ‌ ప్రాజెక్టును ప్రారంభించాల్సి ఉంది.

 

 

కానీ ఈ సినిమాను అనౌన్స్ చేసి ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటివరకు షూటింగ్ ప్రారంభం కాలేదు. మరోవైపు కనడ స్టార్ యష్‌ ఈ ఏడాది ఆరంభంలో `కేజిఎఫ్ 2` మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాతో ఈయ‌న‌కు కన్నడలోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్ప‌డ్డారు. అయితే కేజీఎఫ్ 2 విడుద‌లై ఇన్ని నెలలు గ‌డుస్తున్నా.. య‌ష్ త‌న‌ తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రారంభించలేదు.

అసలు దర్శకుడు ఎవరు అన్నది కూడా ఇంతవరకు బయటకు రాలేదు. దీంతో ఇప్పుడు అటు ఎన్టీఆర్, ఇటు యష్ లపై సొంత అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెంత టైం తీసుకుంటారంటూ సోషల్ మీడియా వేదిక‌గా ఏకేస్తున్నారు. మొత్తానికి సొంత అభిమానులు చేతనే ఈ ఇద్దరు హీరోలు చివాట్లు తింటున్నారు. దీంతో వీరి కష్టం పగవారికి కూడా రాకూడదంటూ ఇతర హీరోల అభిమానులు సెటైర్లు పేలుస్తున్నారు. మరి ఎప్పటికైనా ఎన్టీఆర్, య‌ష్ లు తమ తదుపరి ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తారా? లేదా? అన్నది చూడాలి.

Share post:

Latest