ప‌వ‌న్ త‌ప్ప మ‌రో హీరో దొర‌క‌లేదా..? ఆ డైరెక్ట‌ర్‌ను ఏకేస్తున్న నెటిజ‌న్స్‌!?

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. శర్వానంద తో `రన్ రాజా రన్` సినిమాను తెరకెక్కించి దర్శకుడుగా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన సుజిత్.. తన రెండో సినిమాను ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేసే అవకాశాన్ని అందుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ప్రభాస్ సుజిత్‌ కాంబినేషన్లో వ‌చ్చిన చిత్రం `సాహో`.

యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రం 2019లో తెలుగుతోపాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మలయాళ, హిందీ భాషల్లో అట్టహాసంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. అయితే నార్త్ ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా బాగానే ఆకట్టుకోవడంతో అక్క‌డ మంచి వసూళ్ల‌ను రాబట్టింది. ఇక సాహో తర్వాత సుజిత్ నుంచి మరో సినిమా రాలేదు. అయితే లాంగ్ గ్యాప్ తీసుకున్న సుజాత్ ఫైనల్ గా డివివి దానయ్య నిర్మాణంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు.

 

ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించబోతున్నాడట. ఇప్పటికే సుజిత్‌ పవన్ కు క‌థ చెప్పి ఆయన్ను మెప్పించాడట. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుంద‌ని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారం పట్ల అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.. ప‌వ‌న్ త‌ప్ప మ‌రో హీరో దొర‌క‌లేదా అంటూ సుచిత్‌ను ఏకేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. పవన్ ఒక్కో సినిమాను పూర్తి చేయడానికి దాదాపు రెండు మూడేళ్లు సమయాన్ని తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే పోయి పోయి పవన్ కి కథ చెప్పవా.. ఇక సినిమా పట్టాలెక్కినట్టే అంటూ సుజిత్ కు చురకలు వేస్తున్నారు.

Share post:

Latest