నయనతార.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సుదీర్ఘకాలం నుంచి సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా సత్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల కోలీవుడ్ దర్శకనిర్మాత విగ్నేష్ శివన్‌ను వివాహం చేసుకుంది. పెళ్లయిన నాలుగు నెలలకే సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి అయింది.
ఈమె సరోగసి ఎన్నో వివాదాలకు దారి తీసినప్పటికీ.. అన్ని చిక్కుల నుంచి నయన్ దంపతులు బయటపడ్డారు. అయితే తాజాగా నయనతార ఓ సంచలన నిర్ణయం తీసుకుందట. సినిమాల నుంచి ఆమె లాంగ్ బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయిందట. తన భర్త, పిల్లలతో కొంత కాలం హాయిగా గడపడానికే నయన్ ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోని కొత్త ప్రాజెక్టులకు ఆమె సైన్ చేయడం కూడా ఆపేసిందట.
ఒప్పుకున్న ప్రాజెక్టులను త్వరత్వరగా పూర్తి చేయాలని నయన్ భావిస్తుందట. దీంతో ఇక ఇప్పట్లో నయన్ సినిమాల్లో కనిపించడం కష్టమే అంటూ జోరుగా నెట్టింట ప్రచారం జరుగుతుంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది. కాగా, సినిమాల విషయానికి వస్తే.. నయన్ బాలీవుడ్లో షారుక్ ఖాన్ సరసన `జవాన్` అనే సినిమా చేస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ ఆఖరి దశకు చేరుకుంది. అలాగే మాధవన్ తో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ఈ మూవీ పట్టాలేక్కబోతోంది.