మొదటి తరం హీరోల నుండి నేటితరం హీరోలు.. మెమొరబుల్ పిక్ వైరల్..!!

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోలలో ఒక్కరైనా దిగ్గజ నటుడు అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ నిన్న ఉదయం మరణించిన సంగతి తెలిసిందే.. ఇక ఆయన మరణించడంతో మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇక ఆయన మరణించడంతో ఆయన పార్దేవదేహం వద్దకు టాలీవుడ్ లోని అగ్ర తారలందరూ చేరుకుని మహేష్ బాబుకి ధైర్యం చెబుతున్నారు.

LIVE Mahesh Babus Father Krishna Dies At 79 Mortal Remains Decorated Prabhas-Ram Charan do The Antim Darshan

ఇక ఈ సందర్భంలోనే ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. అభిమానులు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఒక కలయిక ఇలా జరగడంతో వారు ఇలాంటి సందర్భంలో చూడాలని అనుకోలేదంటూ వాళ్ళు వాపోతున్నారు. అయితే ఈ కలయికలో మహేష్ తో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు అక్కినేని నాగచైతన్య కలిసి ఉన్న ఒక ఫోటో బయటికి వచ్చింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.

ఈ ఫోటో సరిగ్గా వీరిరీ కలయిక లోనే అలనాటి సీనియర్ హీరోలైన సూపర్ స్టార్ కృష్ణతో- అక్కినేని నాగేశ్వరరావు అలాగే నందమూరి తారక రామారావు కలిసి ఉన్న ఫోటోకు ఇప్పుడు ఈ ముగ్గురు యువ హీరోలు కలిసి ఉన్న ఫోటోను జత చేసిన ఉన్న‌ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అభిమానులు ఈ ముగ్గురి కలయిక ఇలా ఉండకూడదని మహేష్ బాబుకి ధైర్యం చెబుతూ తమ ఆవేదను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్..!!

Share post:

Latest