టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే . `ఎస్ఎస్ఎంబి 28` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. ఇందులో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇటీవలే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళి.. ఫస్ట్ షెడ్యూల్ లో కంప్లీట్ చేసుకుంది. రెండో షెడ్యూల్ ప్రారంభించే లోపే మహేష్ తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ, తల్లి ఇందిరా దేవుని కోల్పోవడంతో.. కొద్దిరోజులు చిత్రీకరణను వాయిదా వేశారు. ఇక డిసెంబర్ రెండో వారం నుంచి ఈ మూవీ షూటింగ్ రీస్టార్ట్ కానుంది అని తెలుస్తుంది. అయితే ఈ సినిమా విషయంలో సూపర్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారట మేకర్స్.
అదేంటంటే.. మొదట ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ మూవీకి మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను లాక్ చేశారట. ఆగస్టు 11న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఇది ఒక రకంగా మహేష్ ఫ్యాన్స్ కు షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే త్రివిక్రమ్ తర్వాత మహేష్ రాజమౌళితో ఓ సినిమా చేయనున్నాడు. త్రివిక్రమ్ సినిమా ఎంత త్వరగా విడుదలైతే రాజమౌళితో సినిమా అంత త్వరగా పట్టాలెక్కుతుంది. కానీ ఇప్పుడు విడుదల తేదీని ఏకంగా మూడు నెలలు వెనక్కి జరిపారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు పట్ల మహేష్ ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.