బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు అనురాగ్ కశ్యప్. బాలీవుడ్ లోనే అగ్ర దర్శకుడుగా కొనసాగుతున్న అనురాగ్… సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్ వల్ల దేశాన్ని విడిచి వెళ్లిపోయారట. వీటితో పాటు తన కూతురికి వచ్చిన బెదిరింపులతో గుండెపోటు వచ్చిందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. అనురాగ్ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టాడు.
‘భారతదేశ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు తన మీద.. తన కుటుంబం మీద ఎన్నో ఇబ్బందికరమైన ఆరోపణలు చేస్తూ తన కూతుర్ని రేప్ చేస్తానని బెదిరిస్తూ మమ్మల్ని దేశం విడిచి పారిపోయేలా చేశారని ఆయన ఆరోపించారు’. ఆ ట్రోలింగ్స్ వల్ల తాను మూడు సంవత్సరాల పాటు డిప్రెషన్లో ఉన్నానని.. అదే టైంలో నాకు గుండె పోటు కూడా వచ్చిందని చెప్పాడు’.
పౌరసత్వ సవరణ చట్టడానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ‘నా మీద నా కుటుంబం మీద ఎన్నో విద్వేషపూరిత ఆరోపణలు చేశారు’. ‘నా కూతుర్ని ట్రోల్ చేస్తూ అత్యాచారం చేస్తానని బెదిరించారు. ఆ బెదిరింపులతో ఆమె డిప్రెషన్ కు లోన్ అయింది’. ‘తర్వాత మేము 2019 నుంచి దేశం విడిచి వెళ్లిపోయాము. తర్వాత తాను చేసే ఓ సినిమా షూటింగ్ కోసం ఇండియాకు వచ్చాను.
నాపై వచ్చిన ట్రోలింగ్స్ వల్ల నా కూతురు ఎంతో ఇబ్బంది పడింది’. ‘దాదాపు మూడు సంవత్సరాల పాటు డిప్రెషన్ లోనే ఉండిపోయింది. ప్రతి విషయానికి కంగారు పడిపోతూ నన్ను కంగారుకు గురిచేసింది. ఆ టెన్షన్లోనే నాకు గత సంవత్సరం గుండెపోటు వచ్చిందని’ ఆయన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.