తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకే కుటుంబం నుంచి వచ్చిన అక్క, తమ్ముళ్లు అక్క ,చెల్లెలు హీరోగా, హీరోయిన్స్ గా రాణించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ హీరోయిన్స్ గా రాణించడం మాత్రం చాలా తక్కువగా అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఫోటోలో కనిపిస్తున్న ముగ్గురు హీరోయిన్స్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగారు. ఈ ముగ్గురి హీరోయిన్ల హవా అప్పట్లో బాగానే అన్నట్టుగా ఉండేది. ముఖ్యంగా హీరోయిన్ నగ్మా అందాల ఆరబోత అప్పట్లో ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. ఇమే అందం ప్రేక్షకులకు ఫిదా అయ్యేలా చేస్తూ ఉంటుంది.స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించిన నగ్మా ఏదైనా సినిమాలో నటిస్తోంది అంటే ఎక్కడలేని క్రేజ్ వచ్చేది.
ఇక నగ్మా సిస్టర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ఆమె జ్యోతిక ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించి ఒక వెలుగు వెలిగింది. జ్యోతిక తెలుగు, తమిళ్ భాషలలో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అలాగే నగ్మా మరొక సిస్టర్ రోషిని కూడా హీరోయిన్గా ఎన్నో చిత్రాలలో నటించింది. అయితే ఈ ముగ్గురు హీరోయిన్స్ తో నటించిన ఏకైక హీరో కేవలం ఒక్కరే ఉన్నారని చెప్పవచ్చు ఆ హీరో ఇప్పటికి హీరోగా పలు చిత్రాలను నటిస్తూ ఉన్నారు.
అయితే ఈ ముగ్గురు అక్కచెల్లెళ్ల మాత్రం కేవలం జ్యోతిక మాత్రమే అడపాదడప సినిమాలలో నటిస్తూ ఉన్నది. మిగతా వారంతా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండటమే కాకుండా నగ్మా ఇంకా వివాహం చేసుకోకుండా అలాగే ఉన్నది. ఇక ఆ స్టార్ హీరో ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. నగ్మా చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన ఘరానా మొగుడు, ముగ్గురు మొనగాళ్లు వంటి చిత్రాలలో నటించింది. ఇక జ్యోతిగా చిరంజీవి ఠాగూర్ సినిమాలో నటించారు. అలాగే రోషినితో మాస్టర్ అనే చిత్రంలో నటించారు చిరంజీవి.