చిరంజీవి, బాలకృష్ణ కంటే కూడా నాగార్జున ఆ విషయంలో చాలా నయం?

టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, ఎన్టీఆర్, వెంకటేష్, నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి జనరేషన్లో ఈ నలుగురిదే హవా సాగింది, నేటికీ సాగుతోంది. ఈ సీనియర్ హీరోలు ఇప్పటికీ తమ మార్క్ చిత్రాలతో సిల్వర్ స్క్రీన్ పైన సందడి చేస్తున్నారు. వెంకీ ఎక్కువగా మల్టీస్టారర్స్ సినిమాలు చేస్తుండగా, చిరంజీవి, బాలయ్య మాత్రం పక్కా మాస్ కమర్షియల్ చిత్రాలు చేసి జనాలను రంజింపజేస్తున్నారు. నాగార్జున సైతం సోలో హీరోగా సత్తా చాటేందుకు అనేక ప్రయోగాలు చేస్తున్నాడు.

ఇకపోతే మిగతావారికంటే నాగార్జున ఓ విషయంలో ప్రత్యేకమని చెప్పుకోవాలి. బుల్లితెరపై తనదైన స్టైల్ లో షోస్ చేస్తూ తన తోటి హీరోలను వెనక్కు నెట్టారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా నాగార్జున బుల్లితెర టీఆర్పీలో టాప్ నిరూపించుకున్నారు. ఇకపోతే ఈ నలుగురు హీరోలు నటించిన రీసెంట్ చిత్రాలు అఖండ, ఆచార్య, బంగార్రాజు, F 3 వివిధ ఛానల్స్ లో ప్రసారం కాగా, ఈ చిత్రాల్లో కేవలం బంగార్రాజు సినిమా మాత్రమే అత్యధిక టీఆర్పీ రాబట్టి మిగతా హీరోలకు షాక్ ఇచ్చింది.

బ్లాక్ బస్టర్ గా నిలిచిన అఖండ సినిమా సైతం బంగార్రాజు కంటే వెనకబడటం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. అఖండ విజయంతో పోల్చుకుంటే బంగార్రాజు కాస్త యావరేజ్ గానే నడిచింది. అయినా కూడా నాగార్జున సినిమాని బుల్లితెర ప్రేక్షకులు అమితంగా ఆదరించారు. జీ తెలుగులో ప్రసారమైన బంగార్రాజు 14 టీఆర్పీ రాబట్టగా, బాలకృష్ణ అఖండ 13.31 టీఆర్పీతో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఇక వెంకటేష్-వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ ఎఫ్ కేవలం 8.26 టీఆర్పీతో సరిపెట్టుకుంది. ఈ లిస్ట్ లో చివరి స్థానంలో మెగాస్టార్ ఆచార్య సినిమా నిలిచింది.