అప్పులోల మధ్యన మారు వేషంలో తిరిగానంటున్న కాంతారా హీరో… కారణమిదే!

RRR తరువాత ఈమధ్య ఓ కన్నడ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటింది. ఆ సినిమానే కాంతారా. తెలుగునాట రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన ఈ సినిమా బాలీవుడ్లో కూడా సత్తా చాటింది. ప్రకృతితో మనిషికి ఉండే అనుబంధం, దాన్ని అతిక్రమిస్తే తలెత్తే పరిణామాల గురించి ఈ సినిమా ద్వారా దర్శకుడు, నటుడు అయినటువంటి అయినటువంటి రిషబ్ శెట్టి చాలాబాగా చూపించారు. ఈ సినిమాతో రిషబ్ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాడు. ఈ సినిమా చూసిన వారందరూ రిషబ్ నటనని పొగిడేస్తున్నారు.

ఈ నేపథ్యంలో రిషబ్ శెట్టిని ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఇంటర్వ్యూ చేసాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన గతానుభవాల గురించి పేర్కొన్నారు. చిన్నప్పటినుండి సినిమాల మీద పిచ్చి ఉండటంతో ఇటువైపు వచ్చానని చెప్పుకొచ్చాడు. ఖర్చులకు డబ్బులు లేక వాటర్ క్యాన్లు మోసే వాడినని అన్నాడు. ఈ క్రమంలోనే ఓ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం రావడంతో పని నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో చేరారట. ఆ సమయంలోనే వాటర్ క్యాన్లు మోస్తూ సంపాదించిన డబ్బులకు మరికొంత డబ్బు అప్పుచేసి హోటల్ వ్యాపారం పెట్టగా ఆరు నెలలు తిరగకుండానే 25 లక్షల రూపాయల అప్పు అయిందట.

దాంతో 25 లక్షలకు వడ్డీలు కట్టేందుకు కొత్త అప్పులు చేయాల్సి రావడం, ఆ తీసుకున్న డబ్బులకు మరలా వడ్డీలు కట్టడం ఎంతో ఇబ్బందిగా ఉండేదట. అలా అప్పులవాళ్ళు తనకోసం తిరిగినప్పుడు మారువేషంలో బయట తిరగాల్సి వచ్చేదని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే డైరెక్టర్ అరవింద్ కౌశిక్ తో కొంచెం పరిచయం ఏర్పడి రక్షిత్ శెట్టి సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. ఇక ఆ సినిమా పరిచయంతో రక్షిత్ శెట్టితో ‘కిరిక్ పార్టీ’ అనే సినిమా తీసి హిట్టు కొట్టాడట. ఆ తరువాత కష్టాలు మెల్లమెల్లగా తొలగిపోయాయట. కాగా ప్రస్తుతం కాంతారా సినిమా ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తుందో చెప్పాల్సిన పనిలేదు.

Share post:

Latest